Hrithik-NTR Steps : హృతిక్-ఎన్టీఆర్ స్టెప్పులు.. మరో నాటు నాటు రెడీ?

Update: 2025-02-12 11:15 GMT

గత ఏడాది 'దేవర' సినిమాతో అభిమానులను అలరించారు జూనియర్ ఎన్టీఆర్. ఆయన నటిస్తున్న ఫస్ట్ బాలీవుడ్ మూవీ 'వార్2' చిత్రంపై భారీ అంచనాలున్నాయి. బాలీవుడ్ సూపర్ హీరో హృతిక్ రోషన్ తో జూనియర్ ఎన్టీఆర్ స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. ఇందులో ఎన్టీఆర్ రా ఏజెంట్ గా కనిపిస్తారని తెలిసింది. హృతిక్ ఉండే యాక్షన్ సన్నివేశాలు హైలెట్ అవుతాయని అంటున్నారు. ఎన్టీఆర్, హృతిక్ ఇద్దరూ మంచి డాన్సర్లు కావడంతో.. ఇద్దరూ చేసే డ్యాన్స్ మరో నాటు నాటు పాట అవుతుందని అభిమానులు ఆశిస్తున్నారు. హీరోలిద్దరి కలయికలో ప్రత్యేక గీతం ఉంటుందని అంటున్నారు. ఈ పాటలో బాలీవుడ్ నటి శద్ధాకపూర్ కూడా కనిపిస్తుందని తెలిసింది. ఈ పాట సినిమాలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని టాక్ నడుస్తోంది. మూవీలో కియారా అద్వానీ మెయిన్ ఫీమేల్ లీడ్ లో నటిస్తోంది. 

Tags:    

Similar News