ఇది చూస్తే వాడకంటే అంటే మీదే సామీ అని అనకుండా ఉండలేరు. ఆ రేంజ్ లో ప్రమోషన్స్ ప్లాన్ చేస్తున్నారు మోహన్ లాల్ ఎంపూరన్ కోసం. ఇప్పటి వరకూ మళయాలం నుంచి వచ్చిన సినిమాలన్నీ ఓటిటిలో ప్యాన్ ఇండియా అనిపించుకున్నాయి. బట్ డైరెక్ట్ ప్యాన్ ఇండియా మూవీ అంటూ రాలేదు. ఆ లోటును తీర్చేందుకు సౌత్ నుంచి మేము సైతం అంటూ ఎంపూరన్ మూవీతో వస్తున్నారు. స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం ఈ కాంబినేషన్లోనే వచ్చిన లూసీఫర్ కు సీక్వెల్. లూసీఫర్ ను తెలుగులో చిరంజీవి గాడ్ ఫాదర్ గా రీమేక్ చేశాడు. బట్ ఈ సారి ఆ ఛాన్స్ లేకుండా ఎంపూరన్ ను ప్యాన్ ఇండియా లెవల్లో ఈ నెల 27న విడదల చేస్తున్నారు. ఆ మధ్య వచ్చిన టీజర్ చూస్తే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో కనిపిస్తోంది. ఇప్పటి వరకూ సౌత్ నుంచి వచ్చిన ప్యాన్ ఇండియా మూవీస్ ను మించి అనే కలరింగ్ కనిపిస్తోంది. అది చాలదు అన్నట్టుగా ఈ చిత్ర ప్రమోషన్స్ ను ఓ రేంజ్ లో ప్లాన్ చేశారు మేకర్స్.
ఫస్ట్ ప్రమోషనల్ ఈవెంట్ ను హైదరాబాద్ నుంచే ప్లాన్ చేస్తున్నారు. ఈ ఈవెంట్ కు పృథ్వీరాజ్ కు సలార్ దోస్త్ అయిన ప్రభాస్ చీఫ్ గెస్ట్ గా రాబోతున్నాడు. మరి డార్లింగ్ వస్తే మూవీ రేంజ్ మారుతుంది. నెక్ట్స్ చెన్నైలో ల్యాండ్ అవుతున్నారు. అక్కడ ముఖ్య అతిథులుగా కమల్ హాసన్ తో పాటు సూర్యను కూడా ఇన్వైట్ చేశారు. బాలీవుడ్ లో అక్షయ్ కుమార్, కర్ణాటకలో కిచ్చా సుదీప్ లు ఈ మూవీ ప్రమోషన్స్ లో పార్టిసిపేట్ చేయబోతున్నారు.వీటితో పాటు మాలీవుడ్ కు బిగ్గెస్ట్ మార్కెట్ అయిన యూఏఈ లో మోహన్ లాల్, పృథ్వీ సందడి చేయబోతున్నారు. ఇందుకోసం దుబాయ్ లోని బుర్జ్ ఖలీఫాలో ఓ ఈవెంట్ ప్లాన్ చేశారట. ఆపై ఖతార్, అబుదాబీలోనూ ఈవెంట్స్ ఉండబోతున్నాయి. ఇక కేరళలో కుదిరితే అన్ని జిల్లాల్లో ప్రమోషనల్ యాక్టివిటీస్ ప్లాన్ చేస్తున్నారట. ఇందుకోసం మెయిన్ టీమ్ రాకపోయినా కీలక పాత్రలు చేసిన మళయాలీలను వాడబోతున్నారని టాక్. మొత్తంగా మోహన్ లాల్ దేశం మొత్తం తెలుసు. పృథ్వీ ఈ మూవీతో కంట్రీలో సెన్సేషన్ క్రియేట్ చేయబోతున్నాడు అని అర్థం అవుతోంది. ఓ స్టార్ హీరోగా తన ప్రయాణం కొనసాగిస్తూనే.. ఇలాంటి భారీ మూవీస్ తో మెప్పించడం అంటే అతని డెడికేషన్ కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.