మల్టీటాలెంటెడ్ స్టార్ ధనుష్ డైరెక్షన్ లో రూపొందుతోన్న మరో సినిమా ఇడ్ల కడై. తెలుగులో ఇడ్లీ కొట్టు అని అర్థం. 2024లో ధనుష్ డైరెక్షన్ లో వచ్చిన రాయన్ వంద కోట్లు కొల్లగొట్టింది. ఈ యేడాది వచ్చిన జాబిలమ్మ నీకు అంత కోపమా క్రేజీ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ అనిపించుకుంది. ఈ చిత్రంతో తన మేనల్లుడు ప్రవీష్ నారాయణన్ ను హీరోగా పరిచయం చేశాడు. ఇక ఇడ్లీకడై ఈ నెల 10న విడుదల చేస్తాం అని గతంలో ప్రకటించారు. కానీ పోస్ట్ పోన్ అయ్యినట్టే అని చెప్పాలి. తిరు మూవీ తరవాత నిత్య మీనన్ మరోసారి ధనుష్ తో రొమాన్స్ చేయబోతోందీ మూవీలో.
దర్శకుడుగా బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్ కొట్టి ఉండటంతో ఇడ్లీకడైపై భారీ అంచనాలున్నాయి. ఈ మూవీతో దర్శకుడుగానే కాక హీరోగానూ మరో బ్లాక్ బస్టర్ కొట్టడం ఖాయం అంటున్నారు. అందుకే బిజినెస్ పరంగానూ ఈ చిత్రంపై క్రేజీ ఆఫర్స్ ఉన్నాయి. అందుకు తగ్గట్టుగానే ఇడ్లీకడైని నెట్ ఫ్లిక్స్ 45 కోట్లకు పైగా చెల్లించి ఓటిటి రైట్స్ దక్కించుకుందనే వార్తలు కోలీవుడ్ లో చక్కర్లు కొడుతున్నాయి. ధనుష్ మూవీకి ఈ రేంజ్ ఆఫర్ అంటే చాలా పెద్దదే అని చెప్పాలి. అతనికి ప్యాన్ ఇండియా రేంజ్ లో ఫ్యాన్స్ ఉన్నారు. కానీ ప్యాన్ ఇండియా సినిమాలేం చేయలేదిప్పటి వరకూ. ప్యాన్ ఇండియా హీరో అని కూడా చెప్పలేం. కాకపోతే తమిళ్ తో పాటు తెలుగు, హిందీ భాషల్లోనూ సినిమాలు చేస్తున్నాడు. విజయాలు అందుకుంటున్నాడు. ఏదేమైనా ఇడ్లీ కొట్టును నెట్ ఫ్లిక్స్ ఇంత మొత్తం పెట్టి తీసుకోవడం అంటే అది సినిమాపై ఉన్న క్రేజ్ కు నిదర్శనం అనే చెప్పాలి.