Nenu Super Woman : 'సూపర్ ఉమెన్ ఫండ్' ను ప్రకటించిన తెలంగాణ ప్రిన్సిపాల్ సెక్రటరీ
'నేను సూపర్ ఉమెన్' షోపై తెలంగాణ ప్రిన్సిపాల్ సెక్రటరీ ప్రశంసలు;
మహిళా వ్యాపారవేత్తలను ప్రోత్సహించేందుకు ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫారమ్ 'ఆహా' ప్రారంభించిన 'నేను సూపర్ ఉమెన్' షోకు విపరీతమైన స్పందన వస్తోంది. ఏంజెల్స్ కూడా మహిళలకు సపోర్ట్ చేసేందుకు రోజురోజుకూ ఉత్సాహం కనబరుస్తున్నారు. గత మూడు వారాలుగా తెలుగు మహిళలని ఎంతో ఉతేజపరుస్తోన్న ఈ షో ద్వారా మహిళలతో ఈక్విటీ, పర్సంటేజీ మాటలు చెప్పిస్తున్నాయి. ఈ ఘనత ఆహాకు మాత్రమే దక్కిందని చాలా మంది ఇప్పటికే ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ గవర్నమెంట్ నుంచి ప్రిన్సిపాల్ సెక్రటరీ జయేష్ రంజాన్, వీహబ్ సీఈఓ దీప్తి రావుల కలిసి 'సూపర్ వుమెన్ ఫండ్' ని ప్రకటించారు. ఈ ఎపిసోడ్ ఆగస్టు 10, 11 తేదీల్లో రాత్రి 7 గంటలకు ఆహాలో ప్రసారం కానుంది.
జయేష్ రంజన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్స్ (ITE&C), పరిశ్రమలు & వాణిజ్య విభాగాల ప్రిన్సిపాల్ సెక్రటరీ ఈ షోపై ప్రశంసలు గుప్పించారు. "ఆహా వారితో కలిసి ఈ షో చేయడం ఎంతో ఆనందగా ఉంది. అందుకే మా వంతు సాయంగా మేము ఈ 'సూపర్ వుమెన్ ఫండ్' ని అందరికి అందుబాటులోకి తేబోతున్నాం. ఏ వుమెన్ ఇంటర్ప్రెన్యూర్స్ కి అయితే ప్రతిభ ఉండి ఇన్వెస్ట్మెంట్ దక్కలేదో, వారికి ఇది ఉపయోగపడుతుంది. అలాగే, ఏంజెల్స్ ఇన్వెస్ట్ చేసిన, ఇంకా స్కేలాబిలిటీ కోసం డబ్బు అవసరమైన వాళ్ళకి కూడా ఈ ఫండ్ ద్వారా మేము మద్దతు ఇస్తాము. వి హబ్ వారు ఈ ఫండ్ ని ఎలా మరియు ఎక్కడ ఉపయోగించాలి అనే ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే, ప్రభుత్వం ఎపుడు కూడా మహిళా వ్యాపారవేత్తలకు తోడుగా నిలుస్తుంది అని ఈ షో ద్వారా నేను మరోసారి అందరికి తెలియజేస్తున్నాను” అని తెలిపారు.
ఇక ఆహాలో ప్రసారమవుతోన్న‘నేను సూపర్ ఉమెన్ అనే షో'.. ముందు చెప్పినట్టుగానే నిజంగానే మహిళల బిజినెస్ డ్రీమ్స్‌కి డోర్ బెల్ లాంటిదని ఇప్పుడు చాలా మంది భావిస్తున్నారు. ఈ షోలో భాగంగా ఈ స్టేజ్ మీదకి మహిళలు వచ్చి వాళ్ల బిజినెస్ ఐడియాలను ప్రెజెంట్ చేస్తారు. వాళ్ల ఐడియాలను ఎంకరేజ్ చేస్తూ వాళ్ల బిజినెస్‌లో ఇన్వెస్ట్ చేయడానికి ఏంజెల్స్ కూడా ఉంటారు. అయితే ఈ ఆహా షోలో ఏంజెల్స్ హేమాహేమీలే వచ్చారు. సింధూర నారాయణ (నారాయణ గ్రూప్ డైరెక్టర్), శ్రీధర్ గాధి (క్వాంటెలా ఐఎన్‌సీ ఫౌండర్, ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్), దీప దొడ్ల (దొడ్ల డెయిరీ ప్రమోటర్), సుధాకర్ రెడ్డి (అభి బస్ ఫౌండర్, ఫ్రెష్ బస్- ఫౌండర్, సీఈఓ), రేణుక బొడ్ల (సిల్వర్ నీడిల్ వెంచర్స్- వెంచర్ పార్ట్‌నర్), రోహిత్ చెన్నమనేని (డార్విన్ బాక్స్ కో-ఫౌండర్), కరణ్ బజాజ్ (ఎలక్ట్రానిక్స్ మార్ట్ ఇండియా)
Show antha navve navvu...!😁
— ahavideoin (@ahavideoIN) August 10, 2023
Kaani ee bussinees idea ki isthara anukunntha dabbu?💰#NenuSuperWoman streaming only on aha!
Every Friday & Saturday @ 7pm.#MeeBusinessDreamsKiDoorBell #WomenEntrepreneurs #BreakingBarriers #AhaSalutingSuperWoman@renukabodla @sridhargadhi… pic.twitter.com/qjxStBvKTl