ఇండస్ట్రీలో ఎవరి సపోర్ట్ లేకుండా సొంతంగా కష్టపడిపైకి వచ్చిన హీరోల్లో విజయ్ దేవరకొండ ఒకడు. తన మూవీల విడుదల సమయాల్లోనే కాకుండా సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ తో ఎప్పుడూ టచ్ లో ఉంటాడు. ఇక తన వ్యక్తిగత జీవితంపై వచ్చే రూమర్ పై వీడీ తాజాగా స్పందించాడు. 'లైఫ్ లో ప్రతిదీ అవసరమే. ఎదురయ్యే ఒడిదొడుకులను కూడా నేను సవాలుగా తీసుకొని వాటిని అధిగమిస్తాను. చిన్నప్పటినుంచి ఎన్నో పరిస్థితులను దాటుకొని ఈ స్థాయికి వచ్చినా. గతంలో ఆడియన్స్ నన్ను సదరన్ సెన్సేషన్, రౌడీ స్టార్.. ఇలాంటి పేర్లతో పిలిచారు. వాటిని నేను అంగీకరించకపోవడంతో నా 'లైగర్' ప్రచారం లో టీమ్ 'ది' అనే పదాన్ని జోడించింది. అప్పటివరకూ ఈ ట్యాగ్ ఎవరికీ లేకపోవడంతో నేను ఒప్పుకున్న. దీనివల్ల ఇతర హీరోలెవరూ ఎదుర్కోనన్ని ఎదురుదెబ్బలు నాకు తగిలాయి. దీంతో దాన్ని తీసేయాలని నా టీమ్ కు సూచించాను. నన్ను విజయ్ దేవర కొండ అని మాత్రమే పిలవాలని చెప్పాను. యూనివర్సల్ స్టార్ నుంచి పీపుల్స్ స్టార్ వరకు ఎన్నో ట్యాగ్స్ ఉన్నాయి. నాకంటే చిన్నవారు, పెద్దవారు వీటిని వాడుకుంటున్నారు. ఇప్పుడు బహుశా ఏ ట్యాగ్ లేకుండా ఉన్న హీరో నేనొక్కడినేనేమో. దానిపట్ల నాకు ఆసక్తి లేదు. ప్రేక్షకులు నన్ను నా నటనతో గుర్తుంచుకోవాల ని కోరుకుంటాను' అని చెప్పుకొచ్చాడు. విజయ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి.