సక్సెస్ అంటే గెలవడం మాత్రమే కాదని, ప్రయత్నించడమూ విజయంలో భాగమేనని సమంత చెప్పారు. రివార్డులు వస్తే కాదు.. తనకు నచ్చినట్లు బతికితే అదే సక్సెస్ అని పేర్కొన్నారు. సిడ్నీలో జరిగిన ఈవెంట్‌లో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ ‘ఆడపిల్ల కాబట్టి అది, ఇది చేయకూడదు అని రూల్స్ పెడితే నచ్చదు. నాకు ఇష్టమొచ్చినట్లు జీవించాలనుకుంటా. లైఫ్‌లో, తెరపై అన్ని రకాల పాత్రలను పోషించాలి. అదే నా గెలుపు అనుకుంటా’ అని పేర్కొన్నారు. సమంత తెలుగులో సినిమా చేసి చాలా రోజులు అవుతోంది. ఆమె మళ్లీ సినిమాల్లోకి రావాలని ఆమె ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఓ స్టార్ హీరోతో సినిమా చేస్తున్నట్టు వార్తలు వస్తున్నా దానిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.
సిటాడెల్ హనీ బన్నీ తర్వాత సమంత కాస్తా సేదదీరుతోంది. మయోసైటి స్ బారిన పడి కోలుకున్న సమంత తర్వాత ఈ వెబ్ సిరీస్ లో నటించింది. నటనలో తన ప్రత్యేకతను చాటిన సామ్ ఇప్పుడు ఆస్ట్రేలియా టూర్ వెళ్లింది. నిన్న ఫెదర్ ల్ సిడ్నీ వైల్డ్ లైఫ్ పార్క్ ను సందర్శించిన సమంత అక్కడ ప్రకృతి జంతువుల మధ్య వెకేషన్ డేని ఆస్వాధించింది. ఇందుకు సంబంధించిన కొన్ని ఫొటోలను ఇన్స్టా లో షేర్ చేసింది.