Manchu Vishnu : ఉమ్మడి కుటుంబం అంటే ఇష్టం.. గొడవలకు ముగింపు రావాలి: మంచు విష్ణు
తనకు ఉమ్మడి కుటుంబం అంటే ఇష్టమని హీరో మంచు విష్ణు చెప్పారు. అలాంటి వాతావరణంలో పిల్లలు పెరగాలనేది తన కోరిక అని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. తన ఫ్యామిలీలో గొడవలకు త్వరగా ఫుల్‌స్టాప్ పడితే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. శివుడు ప్రత్యక్షమై వరమిస్తానంటే ఎన్ని జన్మలైనా తండ్రిగా మోహన్‌బాబే ఉండాలని కోరుకుంటానని పేర్కొన్నారు. ఇటీవల మంచు ఫ్యామిలీలో వివాదాలు చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. మంచు విష్ణు హీరోగా నటించి, భారీ బడ్జెట్‌తో స్వయంగా నిర్మించిన 'కన్నప్ప' సినిమాను ఏప్రిల్ 25న విడుదల చేయబోతున్నారు. పాన్ ఇండియా రేంజ్‌లో విడుదల కాబోతున్న కన్నప్ప సినిమా ప్రమోషన్ బాధ్యత మొత్తం మంచు విష్ణు తన భుజాలపై వేసుకున్నారు. పలు ముఖ్య నగరాల్లో ఇప్పటికే మీడియా సమావేశాలు నిర్వహించారు. ముఖేశ్ కుమార్ సింగ్ డైరెక్ట్ చేస్తున్న కన్నప్ప మూవీ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఏప్రిల్ 25న విడుదల కానుంది. ఇందులో మోహన్‌బాబు, శరత్ కుమార్, మోహన్‌లాల్, ప్రభాస్, కాజల్ అగర్వాల్, అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.