ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వంలో తెరకెక్కిన పరదా మూవీతో ప్రేక్షకుల ముందుకు రానుంది మలయాళ బ్యూటీ అనుపమా పరమేశ్వరన్. ఈ సినిమా ఆగస్టు 22న థియేటర్లలో విడుదల కానుంది. మూవీ రిలీజ్ సందర్భంగా ప్రమోషన్స్లో బిజీగా ఉందీ భామ. వరుస ఇంటర్వ్యూలతో తన కెరీర్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పుకొచ్చింది. సినీ నేపథ్యం లేకుండా ఇండస్ట్రీలో కొనసాగడం చాలా కష్టమని చెప్పింది. కొన్ని సందర్భాల్లో హీరోయిన్స్ అడిగే చిన్న చిన్న విషయాల ను కూడా టీమ్ సీరియస్ గా తీసుకుంటుందట. అలాంటి ఘటనలు తనకు గతంలో చాలా ఎదురయ్యాయని తెలిపింది. ఉదయం 7 గంటలకు రెడీ అయితే.. 9.30 వరకు షూటింగ్ మొదలు కాదని, కో స్టార్స్ లేట్ గా వస్తారని తెలిసినప్పటికీ తాను మాత్రం 7 గంటలకే రెడీగా ఉండాల్సి వచ్చేదని గుర్తు చేసుకుంది. ఇదే విషయం టీమ్ ను అడిగితే పొగరు ఎక్కు వైందని అన్నారట. మొదట్లో బాధపడ్డప్పటికీ.. క్రమంగా ఆ మాటలు పట్టించుకోవడం మానేసినట్లు చెప్పింది. హీరోలకు మాత్రం తమ లాంటి పరిస్థితి ఉండదని చెప్పిన అనుపమ.. ఇండస్ట్రీలోనే కాకుండా బయట కూడా మహిళలకు ఇదే పరి స్థితి అని ఆవేదన వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఆమె పరదాతో పాటు బైసన్, కిష్కిందపురి మూవీస్ చేస్తోంది.