సప్తసాగరాలు సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన భామ రుక్మిణీ వసంత్. ఆ తర్వాత వచ్చిన అప్పుడో ఇప్పుడో ఎప్పుడో రుక్మిణికి తీవ్ర నిరాశ మిగిల్చింది. ఇదిలా ఉంటే రీసెంట్ గా రుక్మిణి ఓ ఇంటర్వ్యూలో టాలీవుడ్ లో తనకు ఇష్టమైన హీరో ఎవరో చెప్పే సింది. తెలుగులో మీకు ఏ హీరో అంటే ఇష్టం? ఎవరితో కలిసి నటించాలనుందని అడగ్గానే తనకు నేచురల్ స్టార్ నానితో కలిసి పని చేయాలని ఉన్నట్టు తెలిపింది. నానితో కలిసి వర్క్ చేయడమంటే ఇష్టమంటోందీ కన్నడ భామ. నాని రేంజ్ డిఫరెంట్ అని, అతను చేసే సినిమాల్లో ఒక అర్థముం అంటోంది. అంటే సుందరానికీ, శ్యామ్ సింగరాయ్ లాగా ప్రతీ సినిమా కొత్తగా ఉండటంతో పాటూ ఆయన సినిమాల్లో హ్యూమర్ ఉంటుందని చెప్పింది. ఈ కాంబినేషన్ ఎప్పుడు సెట్ అవుతుందో చూడాలి.