Heroine Tanya : అలా అడిగే సరికి ఆశ్చర్యపోయా! : తాన్యా రవిచంద్రన్

Update: 2024-05-11 07:21 GMT

ప్రముఖ నటుడు రవిచంద్రన్ మనవరాలిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది హీరోయిన్ తాన్యా. తన మొదటి సినిమా "పాలే విల్లియతేవా"తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. దీంతో ఈ ముద్దుగుమ్మకు టాలీవుడ్ లో వరుస అవకాశాలు దక్కాయి. అనంతరం బృందావనం, కరుప్పన్, నెంచుకు నీతి, మాయోన్, అఖిలన్ వంటి చిత్రాల్లో ఈ అమ్మడు నటించింది. విజయ్ సేతుపతికి జోడీగా కరుప్పన్ సినిమాలోనూ యాక్ట్ చేసి మంచి క్రేజ్ తెచ్చుకుంది.

చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమాలో నయనతారకు చెల్లిగానూ తాన్యా కనిపించింది. తాజాగా ఈ బ్యూటీ నటించిన రసవాది సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్లలో భాగంగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తాన్యా.. కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించింది.

క్రితం జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఓ అభిమాని.. నన్ను పెళ్లి చేసుకుంటావా అక్కా.. అని విచిత్రమైన ప్రశ్న అడిగాడు. ఆ ప్రశ్న నాకు అర్థం కాలేదు. అక్కా.. పెళ్లి అంటూ రెండూ సంబంధం లేకుండా మాట్లాడాడు. అతడి ప్రశ్నకు ఏం చెప్పాలో అర్థం కాలేదు. ఇప్పటికీ ఆ ఘటన గుర్తుకు వస్తే నవ్వొస్తుంది అని తాన్యా చెప్పుకొచ్చింది.

Tags:    

Similar News