టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తన కెరీర్‌కి సంబంధించి ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ఒకేసారి ఎక్కువ సినిమాలకు కమిట్ అవ్వనని ... తన ఆరోగ్యానికి మొదటి ప్రాధాన్యత ఇస్తానని ఆమె స్పష్టం చేశారు. గ్రాజియా ఇండియా మ్యాగజైన్ కవర్ పేజీపై మెరిసిన సమంత ...ఆ మ్యాగజైన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు కీలక విషయాల గురించి మాట్లాడారు.
గత 15 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నానని...గతంతో పోలిస్తే ఇప్పుడు తనలో ఎంతో మార్పు వచ్చిందని అన్నారు. సోషల్ మీడియా లో మనకు వచ్చే ప్రశంసలను ఎలా స్వీకరిస్తామో... ట్రోలింగ్, నెగెటివ్ కామెంట్లను కూడా అంతే హుందాగా తీసుకోవాలని ..అది మన జీవితాన్ని నియంత్రించే స్థాయికి వెళ్లకూడదు" అని ఆమె అభిప్రాయపడ్డారు. ఇకపై పనిభారం తగ్గించుకుని.. శారీరక, మానసిక ఆరోగ్యానికే మొదటి ప్రాధాన్యత” ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. “తక్కువ సినిమాలే చేసినా, ప్రేక్షకులకు నచ్చే మంచి కథలతోనే వస్తాను” అని వివరించారు సమంత. కాగా ప్రస్తుతం సమంత రాజ్ & డీకే దర్శకత్వంలో రూపొందుతున్న రక్త్ బ్రహ్మాండ్: ది బ్లడీ కింగ్‌డమ్’ అనే పీరియాడిక్ డ్రామాలో నటిస్తున్నారు.