సినిమా ఇండస్ట్రీలో తమకు ఎదురైన చేదు అనుభవాలను పలువరు నటీమణులు పలు సందర్భాల్లో ఇప్పటికే వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే తనకు కూడా సెట్ లో అలాంటి దురదృష్టకర పరిస్థితి ఎదురైందని తాజాగా మలయాళ నటి విన్సీ అలోషియస్ వెల్లడించింది. అంతే కాదు. తాను ఎదుర్కొన్న వేధింపుల తర్వాత ఆమె ఓ పెద్ద నిర్ణయం తీసుకుంది. డ్రగ్స్ తీసుకున్న ఏ ఆర్టిస్ట్ తోనూ కలిసి పని చేయనని ప్రకటించింది. తనతో గత సినిమాలో కలిసి నటించిన తోటి ఆర్టిస్ట్ డ్రగ్స్ తీసుకొని తనతో ప్రవర్తించిన తీరుతో చాలా ఇబ్బంది పడినట్లు తెలిపింది. అయితే తనకు ఇబ్బంది కలిగించిన ఆర్టిస్ట్ పేరు బయటపెట్టని నటి... 'వ్యక్తి గత జీవితంలో డ్రగ్స్ వాడాలా? వద్దా? అనే ది వేరే విషయం. కానీ సెట్ పైన మాత్రం ఇతరులకు ఇబ్బంది కలుగుతుంది. అలాంటి వారితో కలిసి పనిచేయడం కష్టం. నేను మాత్రం అలాంటి వారితో పనిచేయను' అని పేర్కొంటూ ఓ వీడియో విడుదల చేసింది.