IBomma Ravi : ఐ బొమ్మ రవి చేసింది తప్పా కాదా..?

Update: 2025-11-24 08:14 GMT

ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన పేరు ఐ బొమ్మ రవి. పైరసీ నెట్‌వర్క్‌ను నడిపాడన్న ఆరోపణలతో అరెస్టయిన తర్వాత ఆయనపై విచారణ కొనసాగుతోంది. ఈ కేసు సినిమాల్లో, సోషల్ మీడియాలో, సాధారణ జనాల్లో ప్రతిచోటా తీవ్రమైన చర్చలకు దారితీసింది. సైబర్ క్రైమ్ అధికారుల అంచనా ప్రకారం రవి నెట్‌వర్క్ ద్వారా ఇప్పటివరకు 22,000కు పైగా సినిమాలు పైరసీ అయ్యాయి. సెలబ్రిటీలు, నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు అందరూ కలిసి వేల కోట్ల నష్టాలు వచ్చాయని అంటున్నారు. ఈ కోణంలో చూస్తే రవి చేసిన పని నేరం అని వాళ్లు అంటున్నారు. కానీ సామాన్యుల దృష్టిలో రవి హీరోగా మారిపోయాడు.

మల్టీప్లెక్సుల్లో టికెట్ రేట్లు ఆకాశమే హద్దు అన్నట్టు పెంచేసుకున్నారు. పండుగలు, వీకెండ్లు, పెద్ద సినిమాలు వచ్చినప్పుడు సింగిల్ టికెట్ మీద రూ.250, రూ350 ఎక్కువ పెంచేసుకుంటున్నారు. ఇక పాప్ కార్న్, కోక్, ఫుడ్ ఐటమ్స్ లాంటి రేట్లు 20 రేట్లు పెంచేసి అమ్ముకుంటున్నారు. ఒక ఫ్యామిలీ సినిమా చూడాలంటే రూ.2,000, రూ.3,000 దాకా ఖర్చవుతుంది. ఈ పరిస్థితుల్లో మధ్యతరగతి, తక్కువ ఆదాయం పొందే వర్గాలకి సినిమా అనేది ఒక లగ్జరీగా మారిపోయింది. అందుకే ఐ బొమ్మకు భారీ క్రేజ్ ఏర్పడింది.

సినిమా బడ్జెట్ వందల కోట్లు పెరిగిందని ఇష్టారీతిన రేట్లు పెంచేసుకుంటున్నారు. కానీ ఇందులో 24 క్రాఫ్ట్స్ కార్మికులకు ఇచ్చేది ఇప్పటికీ తక్కువే. కేవలం హీరోల రెమ్యునరేషనే సినిమా బడ్జెట్ లో 50 శాతం ఉంటుంది. ఇక డైరెక్టర్, హీరోయిన్, మ్యూజిక్ డైరెక్టర్ల రెమ్యునరేషన్లు కూడా బాగానే ఉంటున్నాయి. వీళ్లకే బడ్జెట్ లో ఎక్కువ మొత్తం పోతోంది. అందుకే టికెట్ రేట్లు పెంచేస్తామంటే ఎలా. ఇంతటి రెమ్యునరేషన్లు ఇవ్వడం ఎందుకు టికెట్ రేట్లు పెంచడం ఎందుకు. ఇలా చేసుకుంటూ పోతే ఐ బొమ్మ కాకపోతే ఇంకో వెబ్ సైట్ వస్తుంది. పైరసీ ఇంకో విధంగా జరుగుతూనే ఉంటుంది. ఐ బొమ్మ రవి లాంటి వాళ్లకు జనాల నుంచి మద్దతు లభిస్తూనే ఉంటుంది.


Full View



Tags:    

Similar News