తోప్ సింగర్.. మల్టీ టాలెంటెడ్.. ఇలాంటి గాయకుడిని ఇంతకు ముందు చూడలేదు.. ఇలాంటి అనేక విశేషణాలు తెచ్చుకున్నాడు సింగర్ పవన్ దీప్ రాజన్. ఉత్తరాఖండ్ కు చెందిన ఈ హైలీ టాలెంటెడ్ సింగర్ ఇండియన్ ఐడల్ సీజన్ 12 విన్నర్. ఇండియన్ ఐడల్ లో ఇదే అత్యుత్తమ సీజన్ అని కూడా చెబుతారు. పవన్ దీప్ గాయకుడుగానే కాక స్వయంగా పాడుతూ అనేక ఇన్ స్ట్రుమెంట్స్ ను ప్లే చేస్తూ వచ్చిన గెస్ట్ లు, కంటెంస్టెంట్స్ ను సైతం ఫిదా చేశారు. ఏ పాటైనా సరే అలవోకగా పాడేస్తూ అలరించాడు. ఈ సీజన్ లో పాల్గొన్న ప్రతి సింగర్ మోస్ట్ టాలెంటెడ్ అనిపించుకున్నారు. అయినా వీరి మధ్య పెద్దగా అరమరికలు కనిపించేవి కాదు. ఓ మంచి వాతావరణం ఉండేది. అదే సీజన్ లో తనతో పాటు రన్నరప్ అయిన అరుణిత కంజిలాల్ తో ప్రేమలో ఉన్నాడు పవన్ దీప్.
అలాంటి పవన్ దీప్ తాజాగా అహ్మదాబాద్ వెళుతుండగా ప్రమాదానికి గురయ్యాడు. ఇదో మేజర్ యాక్సిడెంట్ గా చెబుతున్నారు. తెల్లవారు ఝామున వెళుతుండగా ఈ ఘటన సంభవించింది. ప్రమాదంలో పవన్ దీప్ తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే హాస్పిటల్ లో జాయిన్ చేశారు. చాలా ఎముకలు విరిగిపోయాయి. దీంతో చాలా సర్జరీస్ చేస్తున్నారట డాక్టర్స్. అతనితో పాటు స్నేహితుడు అజయ్ మెహ్రా, డ్రైవర్ రాహుల్ ఉన్నారు. అహ్మదాబాద్ లో ఓ ఈవెంట్ కోసం వీరు ప్రయాణం చేస్తున్నారు.
పవన్ దీప్ కు యాక్సిడెంట్ అయిన విషయం తెలిసిన వెంటనే అభిమానులు అతను త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు మొలుపెట్టారు. ఇండియన్ ఐడల్ జడ్జెస్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఏదేమైనా అతను త్వరగా కోలుకుని మళ్లీ పాటలతో అలరించాలని మనమూ కోరుకుందాం.