Olivia Morris : ఒలివియా మోరిస్‌కి RRRలో ఛాన్స్ ఎలా వచ్చిందో తెలుసా?
Olivia Morris : టాలీవుడ్ జక్కన్న డైరెక్షన్‌లో ఎన్టీఆర్, రామ్ చరణ్ మెయిన్ లీడ్‌లో తెరకెక్కిన ఈ మూవీ నేడు (మార్చి 25న) ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది.;
Olivia Morris : వరల్డ్ వైడ్‌గా ఇప్పుడు RRR మేనియా మొదలైంది. టాలీవుడ్ జక్కన్న డైరెక్షన్‌లో ఎన్టీఆర్, రామ్ చరణ్ మెయిన్ లీడ్‌లో తెరకెక్కిన ఈ మూవీ నేడు (మార్చి 25న) ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్ కి జోడీగా బ్రిటిష్ నటి ఒలీవియా మోరిస్ జెన్నిఫర్ పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. రాజమౌళి RRR కోసం ఈ అమ్మాయిని ఎంపిక చేయడంతో సినీ ప్రేక్షకులు ఈ అమ్మడు గురించి ఆరా తీయడం మొదలు పెట్టారు..
ఒలివియా మోరిస్ 29 జనవరి 1997లో ఇంగ్లాండ్‌లోని సౌత్ వెస్ట్ లండన్‌లోని కింగ్‌స్టన్ అపాన్ థేమ్స్‌లో జన్మించింది.. ప్రస్తుతం ఆమె వయసు 25 సంవత్సరాలు. ఆమెకి చిన్నప్పటి నుంచే నటన పైన ఆసక్తి ఉండడంతో మోడల్‌గా కెరీర్ మొదలు పెట్టింది. థియేటర్ ఆర్టిస్ట్‌గా మంచి పేరు సంపాదించుకుంది. నటనలో చిన్నారులకి శిక్షణ ఇస్తూనే లండన్‌లో జరిగే పలు ఫ్యాషన్ షోలలో పాల్గొనేది ఒలివియా.
ఈ క్రమంలో అవకాశాలు రావడంతో '7 ట్రైల్స్ ఇన్ 7డేస్' అనే టీవీ సిరీస్‌లో నటించింది. RRR చిత్రంతో ఇప్పుడు ఇండియన్ సినిమాకి పరిచయమైంది ఈ బ్యూటీ.. ఈమె కంటే ముందుగా ఎన్టీఆర్ పక్కన డైసీ ఎడ్గార్ జోన్స్ అనే నటిని తీసుకున్నారు జక్కన్న... కానీ ఆమె ఆ తర్వాత కొద్ది రోజులకే ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకోవడంతో ఆ ఛాన్స్ ఒలివియా మోరిస్‌కు దక్కింది.
ఒలివియా జాక్ హామెట్‌తో రిలేషన్‌లో ఉన్నట్టుగా తెలుస్తోంది.
ఒలివియాకు కుక్కలంటే చాలా ఇష్టం.. ఆమె దగ్గర వూఫ్ అనే పెంపుడు కుక్క కూడా ఉంది.
పాటలు పాడడం, వినడం ఆమెకు చాలా ఇష్టమైన కాలక్షేపం.
ఆమె క్రీడలలో కూడా మంచి నైపుణ్యం కలిగి ఉంది.. క్రమం తప్పకుండా వైమానిక విన్యాసాలు, జిమ్నాస్టిక్స్, గుర్రపు స్వారీ చేస్తుంది.
గూగుల్‌లో అత్యధిక మంది సెర్చ్ చేసిన నటిగా రికార్డు సృష్టించింది. ఆమె పేరు ఒక్క రోజులో 200k కంటే ఎక్కువ సార్లు సెర్చ్ చేశారు.