RRRలో ఎన్టీఆర్ వాడిన బైక్ ... దీనికోసం రాజమౌళి ఎంత ఖర్చు చేశాడంటే?
RRR Bike : దర్శకధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం RRR.. ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు కలిసి నటిస్తుండడంతో ఈ సినిమా పైన అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి.;
RRR Bike : దర్శకధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం RRR.. ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు కలిసి నటిస్తుండడంతో ఈ సినిమా పైన అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. దీనికి తోడు రిలీజైన ట్రైలర్‌కు కూడా మంచి రెస్పాన్స్ రావడంతో ఆ అంచనాలు మరింతగా పెరిగాయి. ఇప్పటికే షూటింగ్ పార్ట్‌ను కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ క్రమంలో టీంమొత్తం ప్రమోషన్ లలో బిజీ అయిపొయింది.
సినిమా విషయంలో ఎక్కడ కూడా రాజీపడలేదని దర్శకుడు రాజమౌళి తెలిపారు. సినిమాలో ఎన్టీఆర్ వాడిన బైక్ గురించి చాలా రీసెర్చ్ చేశారట.. ఈ బైక్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఈ బైక్ పేరు వెలోసెట్ రెట్రో బైక్.. ఆ బైక్ 1934 కు చెందిన ఎమ్ సిరీస్ బైక్‌లా కనిపిస్తోంది. ఇది బ్రిటన్‌కి చెందింది. వెలోసెట్ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఈ కంపెనీ హెడ్ ఆఫీస్ బర్మింగ్‌హామ్‌లో ఉంది.
1920 నుంచి 1950 వరకు...వెలోసెట్ అంతర్జాతీయ మోటార్ రేసింగ్ విభాగంలో ప్రధాన పోటీదారుగా నిలిచింది. శక్తివంతమైన 350 సిసి, 500 సిసి బైక్‌లను తయారు చేసింది. అయితే రానురాను ఇతర ఆటోమొబైల్ కంపెనీల నుంచి తీవ్రమైన పోటీరావడంతో వెలోసెట్ బైక్ల తమ ఉత్పత్తులను నిలిపివేసింది. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో ఈ బైక్స్ అత్యంత ప్రాచుర్యం పొందినట్టుగా తెలుస్తోంది.
1971లో పిభ్రవరి తర్వాత అధికారికంగా బైక్‌ల ఉత్పత్తిని వెలోసెట్ నిలిపివేసింది. అయితే RRR సినిమా కోసం ఈ బైక్‌లో కొన్ని మార్పులు చేశారు. దాదాపుగా దీని కాస్ట్ తొమ్మిది లక్షలు ఉంటుందట.. ఇలాంటి రెట్రో బైక్స్ ఎక్కువగా అక‌్షన్ వెబ్‌సైట్‌లోనే కనిపిస్తాయి.ఇక ఈ సినిమాలో ఆ బైక్ కోసం రాజమౌళి ఏకంగా పది లక్షలు ఖర్చు పెట్టాడని సమాచారం.