Bhagyasri Borse : భాగ్యశ్రీకి బంపర్ ఆఫర్స్

Update: 2025-03-03 09:02 GMT

ఏ ఇండస్ట్రీలో అయినా ఫస్ట్ మూవీ ఫట్ అంటే నెక్ట్స్ మూవీకి ఆఫర్స్ రావడానికి సమయం పడుతుంది. బట్ కొందరు మాత్రమే హిట్టూ ఫ్లాపులతో పనిలేకుండా నాన్ స్టాప్ ఆఫర్స్ కొట్టేస్తుంటారు. ఆ మధ్య పెళ్లి సందడి అనే యావరేజ్ మూవీతో ఎంట్రీ ఇచ్చిన శ్రీ లీల ధమాకా ఆఫర్ అందుకుంది. అది హిట్ కావడంతో చాలా ఆఫర్స్ అందుకుంది. రీసెంట్ గా భాగ్య శ్రీ బోర్సే అదే రవితేజ సరసన మిస్టర్ మూవీతో పరిచయం అయింది. బట్ ఈ బచ్చన్ డిజాస్టర్ అయింది. అయినా అమ్మడికి అనేక ఆఫర్స్ వచ్చాయి.. వస్తున్నాయి కూడా.

విజయ్ దేవరకొండ సరసన కింగ్ డమ్ మూవీతో పాటు రామ్ పోతినేని సరసన ఓ సినిమా.. దుల్కర్ సల్మాన్, రానా దగ్గుబాటి ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న ప్యాన్ ఇండియా మూవీ ‘కాంత’లో తనే హీరోయిన్. ఈ మూడు సినిమాలూ ప్రామిసింగ్ గా కనిపిస్తుండటం విశేషం. అయితే లేటెస్ట్ గా ప్రతి హీరోయిన్ కలలు కనే ఆఫర్ అందుకోబోతోంది అనే వార్తలు వస్తున్నాయి. ఇందులో ఆశ్చర్యం లేదు కానీ.. ఆ ఆఫర్ మాత్రం నిజంగా అమ్మడికి బంపర్ ఆఫర్ అవుతుంది.

ప్యాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ సరసన భాగ్య శ్రీ ఆఫర్ కొట్టేసిందనేదే ఆ న్యూస్. సందీప్ రెడ్డి వంగా రూపొందించబోతోన్న స్పిరిట్ చిత్రంలో ఈవిడనే హీరోయిన్ గా తీసుకుంటున్నారు అనే న్యూస్ బలంగా వినిపిస్తోంది. మరి ఇదే నిజమైతే భాగ్య శ్రీ రేంజ్ ఎక్కడికో వెళ్లిపోతుంది.

Tags:    

Similar News