సూర్య కథానాయకుడిగా కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోన్న సంగతి తెలిసిందే. 2డి ఎంటర్‌టైన్‌మెంట్స్, స్టోన్ బెంచ్ ఫిల్మ్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
ఈ చిత్రంలో పూజా హెగ్డేను హీరోయిన్‌గా ఎంపిక చేసినట్లు సమాచారం. త్వరలోనే మేకర్స్ అధికారికంగా ప్రకటిస్తారని తెలుస్తోంది. ఈ మూవీ షూటింగ్ వచ్చే నెల తొలి వారం అండమాన్ దీవుల్లో మొదలవనుంది. తొలి షెడ్యూల్ దాదాపు 40 రోజులు సాగుతుందని వార్తలు వస్తున్నాయి. లవ్, యాక్షన్ అంశాలతో రూపొందే ఈ సినిమాకు సంతోష్ నారాయణన్ మ్యూజిక్ అందిస్తున్నారు.
కాగా, బీస్ట్ తర్వాత పూజా హెగ్డేకి ఇది మూడో తమిళ సినిమా అవుతుంది. తాత్కాలికంగా సూర్య 44 అనే టైటిల్‌తో తెరకెక్కుతున్న మలయాళ నటుడు జోజు జార్జ్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఊటీలో మరో కీలక షెడ్యూల్ ప్లాన్ చేసింది చిత్రబృందం.