Rajamouli's Varanasi : మహేష్ బాబు, రాజమౌళి వారణాసి రిలీజ్ డేట్ ఇదేనా

Update: 2026-01-29 09:00 GMT

సూపర్ స్టార్ హీరో మహేష్ బాబు ఫస్ట్ టైమ్ ఓ ప్యాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు. ఓ రకంగా చెబితే ఇది ప్యాన్ వరల్డ్ మూవీ కూడా. అందుకు కారణం రాజమౌళి. ఆల్రెడీ రాజమౌళి బాహుబలి, ఆర్ఆర్ఆర్ తో వాల్డ్ వైడ్ గా ఆడియన్స్ ను మెస్మరైజ్ చేసి ఉన్నాడు. దీంతో ఆ తర్వాత మూవీ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తలు తీసుని ఉండే ఉంటాడు కదా. పైగా ఆ విషయం కూడా ఈ మూవీ టైటిల్ అనౌన్స్ మెంట్ వీడియోతోనే ప్రూవ్ చేసుకున్నాడు. ఇదో భారీ సినిమాగా రూపొందబోతోంది. రాజమౌళి ఇప్పటి వరకు చేయని ప్రయత్నంలాగా ఈ మూవీ ఉండబోతోంది అనిపించాడు. ప్రియాంక చోప్రా హీరోయిన్ గా పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ గా నటించబోతున్నారు. మిగతా ఆర్టిస్టుల గురించిన వివరాలు మాత్రం చెప్పలేదు.

ఇక ఈ మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ అయినట్టుగా తెలుస్తోంది. అఫ్ కోర్స్ రాజమౌళి అనౌన్స్ చేయలేదు. బట్ రిలీజ్ డేట్ ఇదే అంటూ సోషల్ మీడియాలో కోళ్లై కూస్తున్నారు జనం. మామూలుగా అయితే రాజమౌళి ఒక సినిమా కోసం మూడేళ్లకు పైగా టైమ్ తీసుకుంటాడు. ఇది కూడా అలాగే ఉండబోతోంది. వారణాసి చిత్రాన్ని 2027 ఏప్రిల్ 7న విడుదల చేయబోతున్నట్టు తెలుస్తోంది. అంటే సినిమా మొదలై రిలీజ్ టైమ్ కు దాదాపు మూడేళ్ల టైమ్ తీసుకుంటారు అనేది తెలుస్తోంది. మరి ఇది కూడా ఒక భాగంగా రూపొందుతుందా లేక రెండు భాగాలుగా రూపొందుతుందా అనేది మాత్రం తెలియాల్సి ఉంది. మొత్తంగా వారణాసి రిలీజ్ డేట్ ఇదే అంటూ సోషల్ మీడియాలో మాత్రం తెగ తెలుస్తోంది. మరి నిజంగా వారణాసి 2027 ఏప్రిల్ 7నే విడుదల కాబోతోందా..? అనేది తెలియాల్సి ఉంది. 

Tags:    

Similar News