Srileela : ఆషికి-3 శ్రీలీల కాదా?

Update: 2025-08-02 10:00 GMT

గుంటూరు కారం సినిమాలో కుర్చీ మడత సాంగ్ తో తన ఎనర్జిటిక్ డ్యాన్స్ చూపిన భామ శ్రీలీల. ఈ అమ్మడు ఆ తర్వాత పుష్ప లో కిసిక్స్ అంటూ అల్లు అర్జున్ తో ఆడి పాడింది. ఈ అమ్మడు ఇప్పుడు బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. రాబిన్ హుడ్ డిజాస్టర్ అయిన తర్వాత ఈ అమ్మడు తన ఆశలన్నీ హిందీ సినిమాపైనే పెట్టుకుంది. ఈ సినిమాకు మొదట ఆషికి 3 అనుకున్నారు. ఆషికి ప్రాంచైజీతో ఈ సినిమాకు సంబంధం లేదని దర్శకుడు అనురాగ్ బసు ప్రకటించారు. త్వరలోనే కొత్త టైటిల్ ను ఈ సినిమా కోసం ప్రకటించబోతున్నట్లు అధికారికం గా వెల్లడించారు. కార్తీక్ ఆర్యన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ దాదాపుగా సగం పూర్తి అయింది. మిగిలిన సగం స్పీడ్ గా పూర్తి చేసి ఇదే ఏడాది చివరి వరకు విడుదల చేయాలని భావించారు. కానీ బాలీవుడ్ సెనేషనల్ సూపర్ హిట్ మూవీ సయ్యారా విడుదల అయిన తర్వాత శ్రీలీల మొదటి హిందీ సినిమా మరింత లేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయనే వార్తలు వస్తున్నాయి. అయితే ఈ సినిమాకు ఏ పేరు ఖరారు చేస్తారనే ది హాట్ టాపిక్ గా మారింది.

Tags:    

Similar News