గూగుల్ సెర్చ్ లో టాప్ 10 నటీనటుల లిస్టుతో తన పేరుండటం గొప్ప విషయం కాదంటోంది. హిందీ సీరియల్ నటి హీనా ఖాన్. ఈ విషయమై సోషల్మీడియా వేదికగా ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. చాలా మంది తనకు అభినందనలు చెబుతున్నారని, ఇదేం ఆనందించాల్సిన, సెలబ్రేట్ చేసుకోవాల్సిన విషయం కాదంటున్నారు. దీనిపై సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని చెప్పింది. నిజం చెప్పాలంటే, తన వరకూ ఇది ఏమాత్రం గర్వించదగ్గ విషయం కాదంది. తానేమీ గొప్పగా సాధించలేదు. అనారోగ్య పరిస్థితుల వల్ల ఇలా గూగుల్ మోస్ట్ సెర్చ్ ఉండే పరిస్థితి ఎవరికీ రావొద్దని తాను కోరుకుంటున్నానని తెలిపింది. తన ప్రయాణంలో ఎంతోమంది ప్రేమాభిమానాలు, ప్రశంసలు పొందానని తెలిపింది.
‘ఏ రిస్తా క్యాకెహ్‌లాతా హై’ ధారావాహికతో విశేష ఆదరణ సొంతం చేసుకున్నారు నటి హీనా ఖాన్. బిగ్ బాస్, ఖత్రోన్ కే ఖిలాడీ వంటి రియాల్టీ షోల్లో పాల్గొన్నారు. తాను రొమ్ము క్యాన్సర్‌తో బాధపడుతున్నానని ఈ ఏడాది ఆరంభంలో ఆమె తెలిపారు. ఇన్‌స్టా వేదికగా పోస్ట్ పెట్టారు. తన కుటుంబసభ్యులు, స్నేహితుల సహకారంతో క్యాన్సర్ మహమ్మారితో పోరాటం చేస్తున్నానని తెలిపారు. చికిత్స కొనసాగుతోందని, దీని నుంచి కచ్చితంగా బయటపడగలననే నమ్మకం ఉందని ఆమె ఆన్‌లైన్ వేదికగా చెప్పారు. తన కోసం ప్రార్థిస్తున్న వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఆనాటి నుంచి తన ఆరోగ్యానికి సంబంధించిన అప్‌డేట్‌లను హీనా ఖాన్ తరచూ ఇన్‌స్టా వేదికగా పంచుకుంటున్నారు.