Jai Bhim : సూర్య 'జైభీమ్' మరో రికార్డు...!
Jai Bhim : తమిళ్ స్టార్ హీరో సూర్య మెయిన్ లీడ్‌లో,జ్ఞానవేల్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'జైభీమ్'.. ప్రొడక్షన్ హౌస్ 2డి ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై సూర్య, జ్యోతిక ఈ చిత్రాన్ని నిర్మించారు.;
Jai Bhim : తమిళ్ స్టార్ హీరో సూర్య మెయిన్ లీడ్‌లో,జ్ఞానవేల్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'జైభీమ్'.. ప్రొడక్షన్ హౌస్ 2డి ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై సూర్య, జ్యోతిక ఈ చిత్రాన్ని నిర్మించారు. జస్టిస్ K చంద్రు జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా.. గతేడాది నవంబర్ 2 న అమెజాన్ ప్రైమ్ వేదికగా విడుదలై మంచి హిట్‌ను సొంతం చేసుకుంది. సినీ విమర్శకుల చేత ప్రశంసలు కూడా అందుకుంది. కేవలం మౌత్ టాక్‌తోనే జై భీమ్ రికార్డు స్థాయిలో వ్యూస్‌ను సంపాదించింది. ఇప్పుడీ సినిమా మరో రికార్డు నెలకొల్పింది.
ఈ సినిమా జనవరి 15, 2022న సాయంత్రం 6:30 గంటలకు కలైంజర్ టీవీలో ప్రసారం అయింది. ఈ చిత్రం 4945.54 ఇంప్రెషన్‌లతో 6.15 TRPని సొంతం చేసుకుంది. కలైంజర్ టీవీలో అత్యధిక టీఆర్పీ పొందిన చిత్రం ఇదే కావడం విశేషం. మరోవైపు 'జై భీమ్' సినిమాకి ప్రముఖ రేటింగ్ సంస్థ IMDB నుంచి ఏకంగా IMDBలో 9.6/10 రేటింగ్ దక్కించుకుంది. 53K Likes తో ఈ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ ఘనత సాధించిన తొలి భారతీయ చిత్రంగా కూడా గుర్తింపు పొందింది.
#JaiBhim world television premiere fetched 6.15 TVR with 4945.54 impressions. [Urban + Rural]
— Manobala Vijayabalan (@ManobalaV) January 28, 2022
HIGHEST for Kalaignar TV in recent years.