Jailer box office collections: ఓవర్సీస్‌లో రూ.100 కోట్లు, ప్రపంచ వ్యాప్తంగా రూ.200 కోట్లు

బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు కలెక్ట్ చేస్తోన్న రజనీకాంత్ 'జైలర్'

Update: 2023-08-13 09:00 GMT

సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన 'జైలర్' ఇటీవలే రిలీజై.. బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది. అంతర్జాతీయంగా తమిళ చిత్ర పరిశ్రమకు అతిపెద్ద ఓపెనర్‌గా అవతరించింది. విడుదలైన మూడు రోజుల్లోనే 12.20 మిలియన్ల డాలర్లు.. అంటే రూ. 100 కోట్లు సాధించి రికార్డు సృష్టించింది. గతంలో, పొన్నియిన్ సెల్వన్: పార్ట్ 1 రిలీజైన మూడు రోజుల్లో 12.35 మిలియన్ల డాలర్లతో అతిపెద్ద ఓపెనర్‌గా నిలిచింది. ఈ సినిమా ఆగస్టు 10న రిలీజ్ కాగా రానున్న రోజుల్లో మరిన్ని కలెక్షన్లు వసూలు చేస్తుందని మేకర్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ఈ చిత్రం గురువారం 4.70 మిలియన్ డాలర్లతో భారీ ఓపెనర్ తో ప్రారంభమైంది. ఇది శుక్రవారం 3.40 మిలియన్ల డాలర్లతో దూసుకుపోయింది. అన్ని మార్కెట్లలో పటిష్టమైన వృద్ధిని కనబర్చిన ఈ సినిమా.. శనివారం మరో 4 మిలియన్ల డాలర్లను వసూలు చేసింది. దక్షిణ భారత చలనచిత్రాలు సాధారణంగా ఓవర్సీస్‌లో ముందంజలో ఉంటాయి, ప్రత్యేకించి రిసెప్షన్ గుర్తించదగిన స్థాయిలో లేనప్పుడు, ఆ సందర్భంలో, అవి త్వరగా బయటకు వస్తాయి. ఆదరణ బాగుంటే, వారాంతంలో బాగా రాణిస్తాయి, అదే ఈ సినిమా విషయంలోనూ జరిగింది.

మూడు రోజుల్లో దాదాపు 4 మిలియన్ల డాలర్లతో ఈ చిత్రానికి ఉత్తర అమెరికా మార్కెట్‌లో అగ్రస్థానంలో ఉంది. మిడిల్ ఈస్ట్ లో 3.35 మిలియన్ డాలర్లతో బాగానే వృద్ధిని నమోదు చేసింది. ఇది తమిళ చిత్రానికి అత్యుత్తమ ప్రారంభం. బిగ్ తమిళ హాట్‌స్పాట్ మలేషియాలో 3 రోజుల్లో RM 7.50 మిలియన్లు వసూలు చేసి, తమిళ చిత్రాల వారాంతపు రికార్డును బద్దలు కొట్టింది. శనివారం నాడు ఇది RM 3 మిలియన్లకు పైగా వసూలు చేసింది. అక్కడ ఈ తరహాలో వసూలు చేసిన మొదటి భారతీయ చిత్రం ఇదే. అదేవిధంగా, అన్ని ఇతర మార్కెట్లయిన తూర్పు, పశ్చిమంలోనూ బాగానే కలెక్షన్లు వస్తున్నాయి.

ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ. 200 కోట్ల మార్క్ ను చేరుకుంది. ఇప్పటి వరకు మొత్తం రూ.216 కోట్లు కలెక్ట్ చేసింది. ఈ వారాంతంలో ఈ సినిమా రూ. 300 కోట్ల మార్క్ చేరుకుంటుందని.. ఫుల్ రన్ లో ఈజీగా రూ.400 కోట్లు వసూలు చేస్తుందని మేకర్స్ నమ్ముతున్నారు. వాస్తవానికి ఈ సినిమా 450 కోట్లకే లాక్ చేయబడినా... రాబోయే రోజుల్లో రూ. 500 కోట్ల మార్క్ దాటుతుందని అంటున్నారు. రాబోయేది స్వాతంత్ర్య దినోత్సవం కాబట్టి.. ఈ క్రమంలో వసూళ్లు పెరిగే అవకాశాలున్నాయని భావిస్తున్నారు.

'జైలర్' ఓవర్సీస్ లో బాక్సాఫీస్ కలెక్షన్లు:

ఉత్తర అమెరికా: USD 3,900,000

మిడిల్ ఈస్ట్: USD 3,350,000

ఆస్ట్రేలియా/NZ: USD 600,000

మలేషియా: USD 1,700,000 సుమారు

సింగపూర్: USD 700,000

మిగిలిన ఆసియా: USD 300,000

యూరోప్: USD 300,000

యూరోప్: 27 USD, 750 USD 550,000

మిగిలిన దేశాల్లో: USD 100,000

మొత్తం: USD 12,200,000 / రూ. 100 కోట్లు

Tags:    

Similar News