అలనాటి అందాల తార శ్రీదేవి తనయ జాన్వీకపూర్ తెలుగులో నటించిన మొదటి సినిమా దేవర. జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి నటించింది జాన్వి. ఎన్టీఆర్ సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ పట్టేసిన అమ్మడు ఆ సినిమా వల్ల పెద్దగా క్రేజ్ తెచ్చుకోలేదు. దేవర సినిమాలో తంగం పాత్ర చేసిన జాన్వి కపూర్ సినిమాలో గ్లామర్ గా మెప్పించినా కూడా ఆమెకు పెద్దగా స్కోప్ దొరకలేదు. మరోపక్క దేవర 2 లో అయినా జాన్వీ పాత్రకు వెయిట్ ఉంటుందా లేదా అన్న డౌట్లు మొదలయ్యాయి. ప్రస్తుతం ఆర్సీ-16లో నటిస్తోందీ భామ. రాంచరణ్ సరసన కేవలం గ్లామర్ పరంగానే కాదు స్కోప్ ఉన్న రోల్ చేస్తుందని తెలుస్తోంది. ఈమధ్య జాన్వీకపూర్ కి తెలుగు సినిమా నుంచి మరో రెండు ఆఫర్లు వచ్చాయట. ఐతే అవి కూడా కేవలం సినిమాలో పాటల వరకు అన్నట్టుగానే అనిపించాయట. అందుకే ఆ సినిమాలను జాన్వీకపూర్ రిజెక్ట్ చేసిందంటున్నారు. ప్రాముఖ్యత లేని పాత్ర చేయడం వల్ల గ్రాఫ్ పడిపోయే ప్రమాదం ఉందని భావించిన జాన్వీ ఇటీవల తెలుగు నుంచి వచ్చిన రెండు ఆఫర్లను రిజెక్ట్ చేసిందట. ఇదిలా ఉంటే ఇక జాన్వి కపూర్ హిందీ ఆఫర్లు కూడా ఆశించిన స్థాయిలో లేవు. అక్కడ గ్లామర్ పరంగా డోస్ పెంచి సినిమాలు చేస్తున్నా వర్క్ అవుట్ కావట్లేదని బెంగపడుతోందీ అమ్మడు.