Janhvi Kapoor : జాన్వీ స్కూటీ రైడ్

Update: 2025-04-23 11:00 GMT

యంగ్ టైగర్ ఎన్టీఆర్ 'దేవర' మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరి చయమైన బాలీవుడ్ భామ జాన్వీ కపూర్. తక్కువ టైంలోనే స్టార్ నటిగా పేరు సంపాదించుకుంది. ప్రస్తుతం తెలుగులో రామ్ చరణ్ తో 'పెద్ద' సినిమాలో నటిస్తోంది. కన్నడ సూపర్‌స్టార్ డాక్టర్ శివరాజ్ కుమార్ కీల‌క పాత్రలో క‌నిపించ‌నున్నారు. మీర్జాపూర్ ఫేమ్ దివ్యేందు శర్మ, జగపతిబాబులు కూడా ఇందులో నటిస్తున్నారు. ఆస్కార్ అవార్డ్ గ్రహీత ఏఆర్ రెహమాన్ స్వరాలు అందిస్తుండగా మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని భారీ బ‌డ్జెట్‌తో నిర్మిస్తున్నారు. అలాగే బాలీవుడ్ యంగ్ రొమాంటిక్ హీరో సిద్దార్థ్ మల్హోత్ర జోడీగా తుషార్ జలోటా తెరకెక్కిస్తున్న 'పరమ్ సుందరి' మూవీ షూటింగ్ లోనూ బిజీగా ఉంది. అయితే నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ పర్సనల్, వృత్తిపరమైన అంశాల విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటుంది. తాజాగా సిద్ధార్థ్ మల్హోత్ర తనకు స్కూటీ నేర్పిస్తున్న ఫొటోలను ఇన్స్టాలో పోస్ట్ చేసింది ఈ భామ. 'నేను రైడ్ కు తీసుకెళ్లడం పరమ్ కి చాలా ఇష్టం' అంటూ క్యాప్ష న్ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

Tags:    

Similar News