Janhvi Kapoor : హీరో పళ్లు రాలగొట్టిన జాన్వీ కపూర్

Update: 2024-05-15 05:57 GMT

జాన్వీ కపూర్, రాజ్ కుమార్ రావు హీరో, హీరోయిన్లుగా తెరకెక్కుతున్న సినిమా మిస్టర్ అండ్ మిసెస్ మహి. క్రికెట్ నేపథ్యంలో ఈ మూవీ తెరకెక్కుతోంది. డైరెక్టర్ శరణ్ శర్మ దీనికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ నెల 31న ఈ సినిమా విడుదల కానుంది. దీంతో మిస్టర్ అండ్ మిసెస్ మహి ప్రమోషన్లలో మూవీ టీం బిజీగా ఉంది. జాన్వీ కపూర్, రాజ్ కుమార్ రావు కూడా ప్రమోషన్లలో సందడి చేస్తున్నారు. అయితే రీసెంట్ గా ఈ మూవీ ప్రమోషన్లలో పాల్గొన్న జాన్వీ.. హీరోతో కలిసి క్రికెట్ ఆడుతూ కనిపించింది. జాన్వీ బ్యాటింగ్ చేస్తుంటే.. రాజ్ కుమార్ బాలింగ్ చేస్తాడు. అయితే హీరోయిన్ కొట్టిన షాట్ కు హీరో పళ్లు విరిగినట్లు యాక్ట్ చేస్తాడు. ఫన్నీగా చేసిన ఈ వీడియో సినీ అభిమానులను తెగ ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్గా మారింది. ఇక జాన్వీ కపూర్ టాలీవుడ్లోకి కూడా ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ హీరోగా రూపొందుతున్న దేవరలో ఈ అమ్మడు హీరోయిన్ గా యాక్ట్ చేస్తోంది. మరోవైపు, రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు తెరకెక్కిస్తున్న చిత్రంలోనూ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది.

Tags:    

Similar News