Janhvi Kapoor : నాకు పక్షవాతం వచ్చిందేమో అనుకున్నా: జాన్వీ

Update: 2024-07-24 10:45 GMT

తాను ఇటీవల ఫుడ్ పాయిజన్‌కు గురైనప్పటి అనుభవాలను బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ పంచుకున్నారు. ‘చెన్నైలో HYD ఫ్లైట్ ఎక్కే ముందు ఒక్కసారిగా నాకు పక్షవాతం వచ్చినట్లు, నేను వికలాంగురాలిగా మారినట్లు అనిపించింది. సొంతంగా రెస్ట్ రూమ్‌కు వెళ్లలేకపోయా. మాట్లాడే స్థితిలో కూడా లేను’ అని గుర్తు చేసుకున్నారు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన ఆమె ప్రస్తుతం ఇంట్లో ఉన్నారు. జాన్వీ తెలుగులో NTR సరసన దేవరలో నటిస్తున్నారు. ప్రస్తుతం జాన్వీ ‘ఉలఝ్‌’ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. దేశభక్తి కథాంశంతో ఇండియన్‌ ఫారెన్‌ సర్వీసెస్‌ నేపథ్యంలో సాగే థ్రిల్లర్‌ చిత్రంగా ఇది సిద్ధమైంది. సుధాన్షు సరియా దర్శకుడు. ఆగస్టు 2న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌ మంచి టాక్‌ సొంతం చేసుకుంది.

ఫుడ్ పాయిజనింగ్ చాలా సందర్భాలలో స్టెఫిలోకాకస్ లేదా ఇ.కోలితో బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు సంభవిస్తాయి. అనేక వైరస్లు, పరాన్నజీవులు లేదా బ్యాక్టీరియా కారణంగా, మనం ఫుడ్ పాయిజనింగ్‌కు గురవుతాము. Staphylococci, Clostridium botulium వంటి క్రిములు ఆహారాన్ని సంక్రమిస్తాయి. మనం ఆ ఆహారాన్ని తినేటప్పుడు మన శరీరంపై దాడి చేస్తాయి. వీటిలో కొన్ని సూక్ష్మక్రిములు మన నాడీ వ్యవస్థను లక్ష్యంగా చేసుకుంటాయి. అటువంటప్పుడు, అవి మరిన్ని సమస్యలను కలిగిస్తాయి.

Tags:    

Similar News