అందాల తార శ్రీదేవి తనయ జాన్వీకపూర్ సోషల్ మీడియా వేదికగా తన అందాలను ఆరబోస్తోంది. ఇన్ స్టాలో ఆమె పోస్టు చేసిన ఫొటో వైరల్ గా మారింది. ఈ ఏడాది టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిందీ భామ. జూనియర్ ఎన్టీఆర్ సరసన దేవర సినిమాలో ఆడిపాడింది. రాంచరణ్ తేజ్ హీరోగా వస్తున్న ఆర్సీ 16లోనూ నటిస్తోంది. ఇందుకు సంబంధించిన షూటింగ్ వర్క్ మొదలు కావాల్సి ఉంది. 2018లో ధడక్ సినిమాతో తెరంగేట్రం చేసిన జాన్వీ.. గతేడాది తేరీ బాతోమే ఇసా ఉల్టా జియా, మిస్టర్ అండ్ మిసెస్ మహీ, ఉలాజ్, దేవర సినిమాల్లో నటించింది. వచ్చే ఏడాది జాన్వీ నటిస్తున్న రెండు సినిమాలు రిలీజ్ కానున్నాయి. సన్నీ సంస్కారీకి తులసీ కుమారీ అనే బాలీవుడ్ మూవీ రిలీజ్ కానుంది. ఆర్సీ 16 కూడా వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్లనుంది. ఇదిలా ఉండగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే జాను పాప.. ఎప్పుడు తన ఆహ్లాదభరితమైన ఫొటోలను పోస్టు చేస్తూ నెటిజెన్ల మన్ననలు పొందుతోంది. ఇటీవల ఆమె పోస్టు చేసిన ఫొటోలను చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.