భారతీయ ఇతిహాసాల్లో రామాయణానికి ప్రత్యేక స్థానం ఉంటుంది. రామాయణంలోని విలువలు అన్ని తరాలకూ ఆదర్శం అని చెబుతుంటారు. అందుకే రామాయణం కావ్యం విశిష్టమైనది అంటారు. అలాంటి రామాయణగాథను ఇప్పటికే ఎన్నోసార్లు వెండితెరపై ఆవిష్కరించారు. ఎవరు ఎన్ని భాషల్లో రూపొందించినా తెలుగు తీసినట్టుగా పౌరాణికాలను ఇంకెవరూ తీయలేరు అనేది నిజం. ప్రస్తుతం తెలుగులో పౌరాణికాలు దాదాపు తగ్గిపోయాయి. రెండేళ్ల క్రితం బాలీవుడ్ లో వచ్చిన ఆదిపురుష్ గ్రాఫిక్స్, విఎఫ్ఎక్స్ కారణంగా అభాసుపాలైనా రామాయణంపై గౌరవంతో చూశారు జనం. త్వరలో బాలీవుడ్ నుంచే మరో రామాయణం రాబోతోంది. రెండు భాగాలుగా రూపొందబోతోన్న ఈ రామాయణం ఫస్ట్ పార్ట్ ను 2026 దీపావళికి విడుదల చేయబోతున్నారు. రెండో భాగాన్ని 2027 దీపావళికి అని ఆల్రెడీ ప్రకటించారు.
ఇక రాముడుగా రణ్ బీర్ కపూర్, సీతగా సాయి పల్లవి నటిస్తోన్న ఈ చిత్రంలో రావణుడుగా కేజీఎఫ్ హీరో యశ్ కనిపించబోతున్నాడు. రావణుడి భార్య మండోదరి పాత్ర కోసం కాజల్ అగర్వాల్ ను ఎంపిక చేసుకుంది టీమ్. ఈ పాత్ర కోసం దేశవ్యాప్తంగా తెలిసిన ఫేస్ అయితే బావుంటుంది అనుకున్నారట. అందుకే కాజల్ ను సెలెక్ట్ చేసుకున్నాం అని చెప్పారు. కాజల్ తెలుగులో కన్నప్ప చిత్రంలో గౌరీదేవిగా కనిపించబోతోంది. రామాయణంలో మండోదరి అంటే తన కెరీర్ లో ఓ మంచి పాత్రగా నిలిచిపోయే అవకాశాలున్నాయి.
ఇక ఈ రామాయణాన్ని నితేష్ తివారీ తెరకెక్కిస్తున్నాడు. సన్నిడియోల్, రకుల్ ప్రీత్ సింగ్, లారా దత్తా వంటి వాళ్లు ఇతర కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు.