Kalki 2898 AD : కంటిన్యూ అవుతోన్న కల్కి దండయాత్ర

Update: 2024-07-20 13:13 GMT

ప్రభాస్, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకోణ్ ప్రధాన పాత్రల్లో నటించిన కల్కి ఈ యేడాది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ లిస్ట్ లో చేరింది. ముఖ్యంగా ప్రభాస్ సినిమాగానే ఆడియన్స్ ముందుకు వచ్చినా అమితాబ్ పాత్ర, కమల్ గెటప్ అందరినీ సర్ ప్రైజ్ చేశాయి. అశ్వత్థామగా అమితాబ్ నటనకు అంతా ఫిదా అయ్యారు. చివర్లో వచ్చిన మహా భారత ఎపిసోడ్ గూస్ బంప్స్ తెప్పించింది. గత నెల 27న విడుదలైన కల్కి నాలుగు వారాలు కావొస్తున్నా.. కలెక్షన్స్ ఏ మాత్రం తగ్గలేదు. అప్పటి నుంచి లాస్ట్ ఫ్రైడే వరకూ విడుదలైన ఏ సినిమా కూడా కల్కికి పోటీ ఇవ్వలేకపోయింది. విశేషం ఏంటంటే బాలీవుడ్ లో కూడా ప్రస్తుతం కల్కికి ఎదురు లేదు. అదే దూకుడు చూపుతోంది.

కల్కి తర్వాత అన్ని భాషల్లోనూ పెద్ద సినిమాలేం విడుదల కాలేదు. వచ్చిన వాటిలో ఏదీ బాక్సాఫీస్ వద్ద నిలబడటం లేదు. ఇక చిన్న సినిమాలైతే విడుదలయ్యాయి అన్న విషయం కూడా తెలియక ముందే పోతున్నాయి. ఇవన్నీ కల్కికి అదనంగా కలిసొస్తున్నాయి. ఈ వీకెండ్ కూడా బుక్ మై షోలో కల్కి మూవీదే హవా ఉంది. కలెక్షన్స్, రికార్డ్స్ ఎలా ఉన్నా.. సినిమా మాత్రం స్ట్రాంగ్ గానే ఉంది. మరి ఈ ఊపు ఇంకా ఎన్ని రోజులు కంటిన్యూ అవుతుందో చూద్దాం.

Tags:    

Similar News