Kamal Haasan In Project K: లో నయా అప్డెట్... కమల్ హసన్ ఫిక్స్

జులై మూడో వారంలో అమెరికాలో మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేయనున్నారు.

Update: 2023-06-25 09:13 GMT

రెబల్ స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ప్రాజెక్ట్ కే (Project K ). నాగ్ అశ్విన్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో భారీ తారాగణం ఉండనుంది. ఇప్పటికే బిగ్ బీ అమితాబచ్చన్, బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకునే, దిశా పటాని నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్రంలో కమల్ హసన్ నటిస్తున్నట్లు చిత్ర బృదం అధికారికంగా ప్రకటించింది.

ఈ సినిమా హాలీవుడ్ రేంజ్ లో తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్వీనీ దత్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ప్రీ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేసిన దర్శకనిర్మాతలు ఇప్పుడు కమల్ హసన్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. జులై మూడో వారంలో అమెరికాలో మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేయనున్నట్లు ప్రభాస్ టీం ట్వీట్ చేసింది. కమల్ హసన్ ఈ సినిమాలో విలన్ పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. సంతోష్ నారాయణ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.




 


Tags:    

Similar News