Kamal Haasan : థగ్స్ సినిమాపై కమల్ దిద్దుబాటు చర్యలు.. కేఎఫ్సీకి లేఖ

Update: 2025-06-04 09:15 GMT

హైకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో కమల్ హాసన్ దిద్దుబాటు చర్యలు చేపట్టారు. కన్నడ భాష వివాదంపై కర్ణాటక ఫిల్మ్ ఛాంబరు లేఖ రాశారు. తన వ్యాఖ్య లను తప్పుగా అర్థం చేసుకున్నారని అందులో తెలిపారు. "నేను మాట్లాడిన ఉద్దేశం వేరు. కానీ నా మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారు. ఇది నాకు ఎంతో బాధ కలిగించింది. వాస్తవానికి మనమందరం ఒక్కటే. ఒకే (భాషా)కుటుంబం నుంచి వచ్చాము అని చెప్పాలని అనుకున్నాను. అంతేతప్ప కన్నడ భాషను తక్కువ చేసే ఉద్దేశం లేదు. కన్నడ భాష గొప్పతనం గురించి ఎలాంటి వివాదం, చర్చలేదు. కర్ణాటక ప్రజల పట్ల ఉన్న అత్యంత గౌరవంతో నేను ఈ లేఖ రాస్తున్నాను" అని అందులో పేర్కొన్నారు. థగ్ లైఫ్ ఆడియో ఆవిష్కరణ సభలో, దివంగత నటుడు డాక్టర్ రాజ్ కుమార్ కుటుంబం పట్ల, ముఖ్యంగా శివరాజ్ కుమార్ పట్ల నిజమైన ప్రేమతో మాట్లాడానని అన్నారు. తన వ్యాఖ్యలు వక్రీకరించపడ్డాయన్నారు కమల్. 

Tags:    

Similar News