నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది అంటారు. ఒక్కోసారి జరిగే తప్పులను ఎత్తి చూపడం కూడా తప్పే అవుతుంది. ముఖ్యంగా సినిమా పరిశ్రమల్లో. బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ కు ఇది బాగా వర్తిస్తుంది. అక్కడ తను మాట్లాడినంత కాలం అంతా ఆహా ఓహో అనేశారు. చాలామంది తనను వ్యతిరేకించేవాళ్లు కూడా బాలీవుడ్ నెపోటిజంపై, కరణ్ జోహార్ నెపో మాఫియాను పెంచి పోషిస్తుండటంపై తను మాట్లాడినప్పుడు చాలామంది పొగిడారు. కాకపోతే బాహాటంగ మద్ధతు ఇవ్వలేదు. ఇదే తనలో ఓవర్ కాన్ఫిడెన్స్ ను పెంచింది. అది పొలిటికల్ గా టర్న్ తీసుకుంది. వెంటనే నేషనల్ అవార్డ్ వచ్చింది. అంతే.. అమ్మడి మాటలకు హద్దులే లేకుండా పోయాయి. నోటికి ఏది వస్తే అది అనేయడం.. లేదంటే ట్వీట్ చేసేయడం. ఇలాంటి వాళ్లు బిజెపిలో ఉంటే మైలేజ్ వస్తుంది కదా. అందుకే పార్టీ టికెట్ ఇచ్చి ఎమ్.పిగా గెలిపించుకున్నారు.
ఈ క్రమంలో తను నటించిన డజనుకు పైగా సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. తన మాటలు, చేష్టలు ఎలా ఉన్నా.. మరోవైపు నుంచి తన మార్కెట్ పోయింది. రీసెంట్ గా తన ఆస్తులన్నీ అమ్మేసి ఎమెర్జెన్సీ అనే సినిమాను రూపొందించింది కంగనా. దీనికి తనే దర్శకురాలు కూడా. ట్రైలర్ చూశాక చాలా విమర్శలు వచ్చాయి. బిజెపికి కూడా సమస్యలు తెచ్చేలా ఉంది. ఇక ఈ చిత్రాన్ని అడ్డుకుని తీరతాం అని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. అన్నిటికీ మించి సెన్సార్ నుంచి అనుమతి రాలేదు. బిజెపియే అధికారంలో ఉన్నా.. సెన్సార్ నుంచి అనుమతి రాలేదు అంటే కంగనా ఏ రేంజ్ లో ఈ సినిమా రూపొందించి ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఈ విషయంలో సొంత పార్టీనీ విమర్శించింది. కట్ చేస్తే నానా తంటాలు పడి సెన్సార్ చేయించుకుని రిలీజ్ కు రెడీ అంది.
ఇక్కడే వచ్చింది అసలు చిక్కు. ఈ చిత్రాన్ని కొనడానికి ఎవ్వరూ ముందుకు రావడం లేదు. ఒక్కడంటే ఒక్క బయ్యరూ ధైర్యం చేయలేకపోతున్నారు. ఈ మూవీ కోసం అమ్మిన ఆస్తులన్నీ మళ్లీ ఈ మూవీ కలెక్షన్స్ తో కొనుక్కోవచ్చు అనుకున్న కంగనా రనౌత్ కు దెబ్బ మీద దెబ్బ పడుతూనే ఉంది. ఏదైనా ఈ చిత్రాన్ని ఎవరు కొన్నా నష్టాలు తప్పవు అనేది ముందుగానే తేలిపోయింది. కంటెంట్ అలాంటిది. అడ్డుకునేవాళ్లు అదనంగా కనిపిస్తున్నారు. థియేటర్ లో ఏదైనా డ్యామేజ్ జరిగితే కంగనా బాధ్యత తీసుకోదు అనిఅందరికీ తెలుసు. అందుకే ఎమర్జెన్సీ చిత్రాన్ని కొనాలంటేనే అంతా భయపడుతున్నారు. రి కంగనా ఇప్పుడెవరిని విమర్శిస్తుందో చూడాలి.