తమిళ స్టార్ హీరో సూర్య చేస్తున్న కొత్త సినిమా కంగువ. దర్శకుడు శివ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో దిశా పాటని హీరోయిన్ గా నటిస్తోంది. పీరియాడికల్ డ్రామాగా వస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా లెవల్లో నవంబర్ 14న విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేయగా ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా గురించి చిత్ర నిర్మాత కేఈ జ్ఞానవేల్ మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. "కంగువ సినిమాలో సూర్య రెండు పాత్రల్లో కనిపిస్తారు. అందులో ఒకటి కంగువ, మరొకటి ఫ్రాన్సిస్. పవర్‌ఫుల్ కంగువ క్యారెక్టర్ 2 గంటలు. ఫ్రాన్సిస్ రోల్ 25 నిమిషాలు ఉంటుంది. రెండింటిలోనూ సూర్య మునుపెన్నడూ చూడని విధంగా కనిపిస్తారు. ఇక ఈ సినిమా భారీ విజయం సాధించడం ఖాయం. రూ.1000 కోట్లు కాదు కంగువ ఖచ్చితంగా రూ.2000 కోట్లు కలెక్ట్ చేస్తుంది" అంటూ చెప్పుకొచ్చాడు. దాంతో ఈ సినిమాపై అంచనాలు నెక్స్ట్ లెవల్ కు చేరుకుంటున్నాయి.