విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప జూన్ 27న విడుదలైంది. మొదట కాస్త నెగెటివిటీ ఉన్నా.. సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. ముఖ్యంగా సెకండ్ హాఫ్ బావుంది అని అంతా చెప్పారు. మంచి రివ్యూస్ కూడా వచ్చాయి. కానీ ఆ స్థాయిలో రెవిన్యూ రాలేదు. మొదటి రోజు భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. మౌత్ టాక్ బావుంది. రివ్యూస్ బావున్నాయి. అయినా కలెక్షన్స్ పరంగా ఆశించిన స్థాయిలో రాలేదు. ఈ విషయంలో విష్ణు కాస్త డిజప్పాయింట్ అయ్యాడు. మొత్తంగా కలిపి 50 కోట్లు కూడా వసూలు చేయలేదీ చిత్రం. బడ్జెట్ చూస్తే 200 కోట్లు పెట్టాం అన్నారు. మరి అదేంటో వారికే తెలియాలి. అయితే రిలీజ్ కు ముందు ఓటిటి డీల్స్ ను సెట్ చేసుకోలేదు విష్ణు. తన సినిమా చాలా పెద్ద విజయం సాధిస్తుంది. అంచేత భారీ అమౌంట్ కోట్ చేయొచ్చు అనుకున్నాడు. రిజల్ట్ ఇలా ఉంది. దీంతో ఇప్పుడు తనే కాస్త తగ్గి ఓటిటి డీల్ తో పాటు శాటిలైట్ రైట్స్ ను కూడా ఫినిష్ చేసుకోబోతున్నాడు. ఈ వారంలో ఓటిటి డీల్ ఫైనల్ అవుతుందట. ఆశ్చర్యం ఏంటంటే.. ఇలా డీల్ సెట్ కాగానే అలా ఓటిటిలోకి వచ్చేస్తుందీ మూవీ.
అన్నీ సెట్ అయితే ఈ నెల 25 నుంచే కన్నప్ప ఓటిటి (అమెజాన్ ప్రైమ్)లో స్ట్రీమ్ అవుతుందని టాక్. ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ ఫైనల్ డీల్ కు ఓకే చెప్పిందంటున్నారు. త్వరలోనే శాటిలైట్ రైట్స్ కూడా ఇచ్చేస్తే నష్టాల నుంచి కొంత వరకైనా బయట పడొచ్చు అనేది విష్ణు ఆలోచన. ఆ మేరకు ఎక్కువ ఆలస్యం చేయకుండా అన్ని డీల్స్ ను క్లోజ్ చేసుకునే ఉద్దేశ్యంలో ఉన్నాడు. సో.. మాగ్జిమం ఈ నెల 25నుంచి కన్నప్ప ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుందనుకోవచ్చు.