విష్ణు మంచు టైటిల్ పాత్రలో నటిస్తూ నిర్మించిన సినిమా కన్నప్ప. టివి మహా భారతం ఫేమ్ ముఖేష్ కుమార్ సింగ్ దర్శకుడు. రిలీజ్ కు ముందు అనేక సందేహాలున్న సినిమా ఇది. కానీ ఈ శుక్రవారం విడుదలై యూనానిమస్ గా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఫస్ట్ హాఫ్ బాలేదు కానీ సెకండ్ హాఫ్ బావుంది అన్న టాక్ అన్ని చోట్లా వినిపించింది. ముఖ్యంగా ప్రభాస్ ఎంట్రీ దగ్గర నుంచి సినిమా మరో టర్న్ తీసుకుంది.విష్ణు నటనకు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి అద్భుతమైన ప్రశంసలు వస్తున్నాయి. అటు హీరోయిన్ తో ఎక్స్ పోజింగ్ ఎక్కువగా చేయించినా.. ఆమె నటనతోనూ ఆకట్టుకుంది. ప్రభాస్ స్క్రీన్ ప్రెజెన్స్, మోహన్ లాల్ గెస్ట్ అప్పీరియన్స్, అక్షయ్ కుమార్, కాజల్ లు పార్వతీ పరమేశ్వరులుగా మెప్పించిన ఈ సినిమా మొదటి రోజు విష్ణు కెరీర్ లోనే హయ్యొస్ట్ కలెక్షన్స్ వసూలు చేసి రికార్డ్ సృష్టించింది.
కన్నప్ప మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 10.6 కోట్ల వరకూ వసూలు చేసింది. ఇండియాలో 9 కోట్లు మిగతా అంతా ఓవర్శీస్ ద్వారా వచ్చిందంటున్నారు. విష్ణు కెరీర్ లోనే ఇది హయ్యొస్ట్ ఓపెనింగ్స్ అని చెప్పాలి. సినిమా బావుంది అనే మౌత్ టాక్ బాగా పెరుగుతోంది. అందుకే ఈ వీకెండ్ లో మరింత ఆకట్టుకునే ఫిగర్స్ వసూలు చేసే అవకాశం ఉంది. మొత్తంగా విష్ణు మంచు ఎన్నాళ్లుగానో చేస్తోన్న ఈ ప్రయత్నం విజయం సాధించినట్టే అని చెప్పాలి. కాకపోతే బ్రేక్ ఈవెన్ కు ఇంకా చాలా దూరంలోనే ఉంది కన్నప్ప.