Kannappa Teaser : కన్నప్ప టీజర్ వస్తోంది

Update: 2024-06-08 07:51 GMT

ప్యాన్ ఇండియా స్థాయిలో ఆకట్టుకుంటున్న సినిమా కన్నప్ప. మంచు విష్ణు నటిస్తున్న చిత్రం 'కన్నప్ప' చిత్రీకరణ దాదాపుగా పూర్తికావచ్చింది. బాలీవుడ్ సహా పలు ఇండస్ట్రీల ప్రముఖులు ఈ మూవీలో నటిస్తున్నారు. అక్షయ్ కుమార్, మోహన్ లాల్, శరత్ కుమార్, మోహన్ బాబుతో పాటుగా కాజల్ అగర్వాల్, బ్రహ్మానందం తదితరులు నటిస్తున్నారు.

కన్నప్ప ప్రత్యేక పోస్టర్ విడుదల చేశారు. గుర్రం మీద విష్ణు కూర్చున్న తీరు, చుట్టూ కనిపిస్తున్న అటవీ ప్రాంతం ఆకట్టుకునేలా ఉంది. ఈ చిత్రానికి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు.

కన్నప్ప టీజర్ ను కేన్స్ ఫెస్టివల్లో ప్రదర్శించారు. మంచి రెస్పాన్స్ వచ్చినట్టు కన్నప్ప టీమ్ ఇప్పటికే ప్రకటించింది. జూన్ 14 కన్నప్ప టీజర్ ను తెలుగులో విడుదల చేయబోతున్నారు. ఈ విషయాన్ని చిత్రబృందం వెల్లడించింది.

Tags:    

Similar News