Kannappa Update : కన్నప్ప అప్డేట్.. . కిరాత లుక్ లో మోహన్ లాల్

Update: 2024-12-17 06:30 GMT

మంచు ఫ్యామిలీ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా కన్నప్ప. హిస్టారికల్ మైథాలజీ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న ఆ సినిమాలో హీరో మంచు విష్ణు లీడ్ రోల్ పోషిస్తున్నాడు. మహాభారతం సీరియల్ ఫేమ్ ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని మోహన్ బాబు నిర్మిస్తున్నాడు. రూ.100 కోట్లకు పైగా బడ్జెట్తోతో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. పాన్ ఇండియా లెవెల్ లో ఎందరో యాక్టర్స్ మూవీలో నటిస్తున్నారు. వేసవి కానుకగా వచ్చే ఏడాది ఏప్రిల్ 25న ప్రపంచవ్యాప్తంగా సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ రీసెంట్ గా ప్రకటించారు. అంతకుముందే ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేశారు. శివుడికి ప్రీతికరమైన రోజు అయిన సోమవారం నాడే సినిమాలో నటిస్తున్న ఆర్టిస్టుల క్యారెక్టర్ ను రివీల్ చేస్తూ.. పోస్టర్లను విడుదల చేస్తున్నారు. ఇప్పటికే మోహన్ బాబు, మంచు విష్ణు సహా పలువురు యాక్టర్స్ ఫస్ట్ లుక్స్ ను మేకర్స్ రివీల్ చేశారు. తాజాగా మాలీవుడ్ మెగాస్టార్ మోహన్ లాల్ లుక్ ను రిలీజ్ చేశారు. కిరాత అనే పవర్ఫుల్ రోల్ పోషిస్తున్నట్లు తెలిపారు. పోస్టర్ పై పాశుపతాస్త్ర ప్రదాత- విజయుడిని గెలిచిన ఆటవిక కిరాత అంటూ రైటప్ ఇవ్వడం విశేషం.

Tags:    

Similar News