Karthi's Annagaru Vostaru : టీజర్ అంతా డ్యాన్సులే కదా

Update: 2025-11-28 11:54 GMT

కార్తీ హీరోగా నటించిన మూవీ అన్నగారు వస్తారు. ఈ మూవీ టైటిల్ ను రీసెంట్ గా అనౌన్స్ చేశారు. మామూలుగా ఎప్పుడో విడుదల కావాల్సిన సినిమా ఇది. రకరకాల కారణాలతో ఆలస్యంగా విడుదల కాబోతోంది. ఈ డిసెంబర్ లోనే విడుదల కాబోతోన్న ఈ మూవీ టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. అనిల్ రావిపూడి విడుదల చేసిన టీజర్ ఇది. మామూలుగా అయితే ఇది తమిళ్ వెర్షన్ అయితే గతంలోనే విడుదల కావాల్సి ఉంది. బట్ తెలుగు వెర్షన్ మాత్రమే టీజర్ విడుదల చేశారు.

టీజర్ మాత్రం రకరకాల ఇష్యూస్ తో ముడిపడి ఉంచారు. అందులో కార్తీ డైలాగ్స్ ఆ మాటకొస్తే మొత్తం టీజర్ లోనూ ఎలాంటి డైలాగ్స్ కూడా విడుదల కాలేదు. ఒక పెళ్లికి అటెండ్ అవుతున్నట్టు పోలీస్ గెటప్ లో కార్తీ కనిపిస్తాడు. అతను ఈ మ్యారేజ్ లో వినిపించే బ్యాండ్ మేళంతో పాటుగా డ్యాన్స్ లు వేస్తుంటాడు. టీజర్ అంతా ఈ బ్యాండ్ మేళం, డ్యాన్స్ మాత్రమే కనిపిస్తాడు. అక్కడక్కడా కార్తీతో పాటు ఇతరుల విజువల్స్ కనిపిస్తుంటాయి. హీరోయిన్ గా కృతిశెట్టి కూడా కనిపిస్తూ ఉంటుంది. అతను కాస్త యాక్షన్ సీక్వెన్స్ లలో కూడా కనిపిస్తున్నట్టుగా ఉంటాడు. మొత్తంగా టీజర్ మాత్రం ఇదీ కంటెంట్ అనిపించేలా లేదు. టీజర్ మొత్తం అతని డ్యాన్స్ లు మాత్రమే హైలెట్ గా కనిపిస్తూ ఉంటాడు.

నాలన్ కుమారస్వామి డైరెక్ట్ చేస్తోన్న మూవీ ఇది. జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నాడు. కార్తీతో పాటు కృతిశెట్టి, సత్యరాజ్, రాజ్ కిరణ్, ఆనంద్ రాజ్, శిల్పా మంజునాథ్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. మోస్ట్ లీ డిసెంబర్ 17నే విడుదల కాబోతోందీ మూవీ. మరి ఈ టీజర్ కు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో తెలుగు ఆడియన్స్ కే అర్థం అవుతుంది. 

Full View

Tags:    

Similar News