Kathi Mahesh: రోడ్డు ప్రమాదం.. కత్తి మహేష్‌కు గాయాలు..
సినీ నటుడు, బిగ్ బాస్ ఫేం కత్తి మహేష్ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు.;
Kathi Mahesh: సినీ నటుడు, బిగ్ బాస్ ఫేం కత్తి మహేష్ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. ఆయన ప్రయాణిస్తున్న కారు ఓ లారీని బలంగా ఢీకొట్టింది. నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం చంద్రశేఖరపురం జాతీయ రహదారిపై కత్తి మహేష్ ప్రయాణిస్తున్న కారు.. లారీని ఢీకొట్టింది. నిన్న అర్థరాత్రి సమయంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు సమాచారం. ఈ ప్రమాదంలో అతడికి స్వల్పంగా గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆయన నెల్లూరులోని మెడికేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
రోడ్డు ప్రమాదంలో కత్తి మహేష్‌కు గాయాలు..ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. బిగ్ బాస్ సీజన్1లో కత్తి మహేష్ పాల్గొన్నారు. ఆతరువాత సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్‌ని సంపాదించుకున్నారు. సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా ఉండే కత్తి మహేష్ మంచి క్రిటిక్.