కోలీవుడ్ సినిమా హిట్ అవడంతో కయాదు లోహార్ స్టార్ హీరోయిన్ గా ఎదిగిపోయింది. ఈ సినిమాలో ప్రదీప్ రంగనాథ న్ కు జంటగా అనుపమా పరమేశ్వరన్, కయాదు లోహార్ నటించారు. డ్రాగన్ చిత్రానికి ముందే అధర్వకు జంటగా ఇదయం మురళి అనే చిత్రంలో నటించడానికి కమిట్ అయ్యింది కయాదు. ఆ తరువాత జీవీ ప్రకాశ్ కు జంటగా ఒక చిత్రం, నటుడు శింబు సరసన పార్కింగ్ చిత్రం ఫేమ్ రామ్ కు మార్ బాలకృష్ణన్ దర్శకత్వంలో ఒక చిత్రం, ధనుష్ కు జతగా విఘ్నేశ్ రాజా దర్శకత్వంలో మరో చిత్రంలో నటించే అవకాశాలు తలుపుతట్టాయి. దీంతో నటి కయాదు లోహర్ పంట పండింది. ఆమె క్రేజ్ మామూలుగా లేదంటూ ప్రచారం జరిగింది. స్టార్ హీరోలు శింబు, ధనుష్ చిత్రాల్లో నటించే అవకాశాలు చేజారిపోయాయి. ఇప్పుడు ధనుష్ కు జంటగా నటించే అవకాశాన్ని నటి మమితా బైజూ తన్నుకుపోయారు. ఈ చిత్రం షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది. అదే విధంగా శింబు సరసన నటించే అవకాశం కోల్పోయినట్లు తాజా సమాచారం. కయాదు లోహర్ ఎంత వేగంగా దూసుకొచ్చారో అంత వేగంగా వెనక్కు తగ్గారంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.