"నేను, శైలజ సినిమాతో తెరంగేట్రం చేసిన భామ కీర్తి సురేశ్. మహానటి సినిమాతో తనకంటూ స్టార్ డమ్ క్రియేట్ చేసుకుందీ భామ. ఆ సినిమాకు జాతీయ ఉత్తమ నటి అవార్డును సైతం సొంతం చేసుకుంది. కీర్తి పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంది. కీర్తి సురేష్ సోషల్ మీడియాలో కనిపిస్తూ ఎల్లప్పుడూ అందరి దృష్టినీ ఆక ర్షిస్తుంది. తన ఇన్ స్టాగ్రాం హ్యాండిల్ లో పోస్ట్ చేసిన ఫొటో ఇప్పుడు వైరల్ గా మారింది. అన్ని రంగులను మిళితం చేసిన డ్రెస్ ధరించి.. ఆనందాన్ని వ్యక్తం చేస్తు న్న ఫొటోలను షేర్ చేసింది. ఈ అమ్మడు ఇటీవల ఆమె తన బరువు తగ్గేందుకు చేస్తున్న ప్రయత్నాలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రతి వారం 300 నిమిషాల పాటు వ్యాయామం చేయడం ద్వారా 9 కిలోల బరువు తగ్గినట్టు రాసుకొచ్చింది. ఆమె తన బరువు తగ్గడానికి ఎలాంటి క్రాష్ డైట్‌లు పాటించకుండా, ఆరోగ్యకరమైన జీవనశైలిని ఎంచుకోవడం ద్వారానే ఈ మార్పు సాధ్యమైందని చెప్పారు. కీర్తి సురేశ్ బరువు తగ్గడంలో కార్డియో వ్యాయామం కీలక పాత్ర పోషించింది. ఆమె రోజూ కనీసం ఒక గంట పాటు కార్డియో వ్యాయామాలు చేసేవారు.తన ఆరోగ్యం పట్ల కీర్తి శ్రద్ధ తీసుకుంటోందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఈ ప్రయత్నం ఆమె బలమైన సంకల్ప శక్తిని తెలియజేసిం దని అంటున్నారు. దృఢ సంకల్పం, ఎవరైనా తమ క్రమశిక్షణతో లక్ష్యాలను సాధించవచ్చని అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు.