పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’లో KGF ఫేమ్ శ్రీనిధి శెట్టి ఓ స్పెషల్ సాంగ్ చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై మూవీ టీమ్ నుంచి స్పష్టత రావాల్సి ఉంది. ఆగస్టులో ఈ మూవీ షూటింగ్ పునః ప్రారంభం కానున్నట్లు సమాచారం. పవర్ స్టార్ 20-25 రోజులు డేట్స్ ఇస్తే షూటింగ్ పూర్తవుతుందని సినీవర్గాలు చెబుతున్నాయి. ఈ మూవీలో కొంతభాగాన్ని క్రిష్ చిత్రీకరించగా, మిగిలిన సన్నివేశాల్ని జ్యోతికృష్ణ డైరెక్ట్ చేయనున్నారు. హరిహర వీరమల్లు కోసం పవన్ కళ్యాణ్ ఇక 20-25 రోజులు కేటాయిస్తే సినిమా మొత్తం పూర్తి అవుతుందని తెలుస్తోంది. ఇప్పుడున్న సమాచారం ప్రకారం ఆగస్టులో పవన్ ఈ సినిమాకి డేట్స్ ఇస్తాడని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో పవన్ యాక్షన్ సీన్స్ హైలైట్‌గా నిలుస్తాయట. కాగా మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత ఏ ఎం రత్నం ఈ సినిమాని భారీగా నిర్మిస్తున్నారు.