కోలీవుడ్ డైరెక్టర్ సుందర్ తెరకెక్కించిన 'అర ణ్మనై 'మూవీ ఇప్పటి వరకు నాలుగు భాగాలు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. 'అర ణ్మనై4’మే నెలలో విడుదలై ఘన విజయం సాధించి, కలెక్షన్ల వర్షం కురిపించింది. దీనికి సీక్వెల్ 'అరణ్మనై 5 'వస్తోందంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోం ది. ఖుష్బూ దీనిపై క్లారిటీ ఇచ్చింది 'అర ణ్మనై5' ప్రాజెక్టుపై సోషల్ మీడియాలో వస్తున్న వార్తలన్నీ కేవలం పుకార్లు మాత్ర మేనని, ఐదో భాగం ఫస్ట్లుక్ ఇదేనంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్టర్ కూడా ఫేక్ అని అన్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పనులు ప్రా రంభంకాగానే ప్రొడక్షన్ హౌస్ అన్నీ క్రియేషన్స్ అధికారికంగా వెల్లడిస్తుం దన్నారు. ప్రస్తుతానికి తమ దృష్టంతా 'గ్యాంగర్స్' సినిమా పైనే ఉంది' అని ఆమె స్పష్టం చేశారు. ట్విట్టర్ వేదికగా ఖుష్బూ క్లారిటీ ఇచ్చారు.