Actor Kiran Abbavaram : కొడుకుకు పేరు పెట్టిన కిరణ్ అబ్బవరం.. ఆ దేవుడిపై భక్తితో..
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం,రహస్య దంపతులకు కొడుకు పుట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నామకారణం వేడుకను తిరుమలలో సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. తమ కొడుకుకు ‘హను అబ్బవరం’ అని పేరు పెట్టినట్లు ఈ దంపతులు తెలిపారు. శ్రీవారి ఆశీస్సులతో పాటు, ఆంజనేయ స్వామి అనుగ్రహం తమ బిడ్డకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈ పవిత్రమైన ప్రదేశాన్ని ఎంచుకున్నట్లు చెప్పారు. ‘‘ఆంజనేయ స్వామి అంటే తమకు ఎంతో భక్తి అని. ఆయనకు గుర్తుగా అబ్బాయికి 'హను' అని పేరు పెట్టినట్లు తెలిపారు. శ్రీవారి సన్నిధిలో ఈ కార్యక్రమం చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ క్షణాలు తమకు మధురంగా మిగిలిపోతాయని సంతోషం వ్యక్తం చేశారు. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ప్రస్తుతం కిరణ్ అబ్బవరం ప్రస్తుతం 'కే రాంప్' అనే చిత్రంలో నటిస్తున్నారు.