Krishnam Raju: ప్రభాస్ పిల్లలతో ఆడుకోవాలని ఉంది: కృష్ణంరాజు
Krishnam Raju: ప్రభాస్ త్వరగా పెళ్లి చేసుకుంటే చూడాలని ఉందన్నారు.;
Krishnam Raju: టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ ఎవరంటే టక్కున గుర్తొచ్చే పేరు ప్రభాస్.. ఎక్కడికి వెళ్లినా ఆయన పెళ్లి ప్రస్తావన తేకుండా ఉండరు ఫ్యాన్స్.. పెద్దమ్మ, పెద్దనాన్నలకు కూడా ప్రభాస్ పెళ్లి చేసుకోవాలని ఆయన పిల్లలతో ఆడుకోవాలని ఉంది.
ఇదే మాటను ఓ ఇంటర్వ్యూలో చెప్పారు కృష్ణంరాజు. రాధాకృష్ణ దర్శకత్వంలో వచ్చిన రాథేశ్యామ్ భారీ వసూళ్లు రాబడుతోన్న నేపథ్యంలో కృష్ణంరాజు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రభాస్ త్వరగా పెళ్లి చేసుకుంటే చూడాలని ఉందన్నారు.
అతడికి పుట్టబోయే పిల్లలతో ఆడుకోవాలని ఉందని అన్నారు. కాగా, రాథేశ్యామ్ చాలా బాగుందని, ముఖ్యంగా సినిమాటోగ్రఫీ అధ్భుతంగా ఉందని తెలిపారు. బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ రాథేశ్యామ్ పై ప్రశంసలు కురిపించనట్లు ఆయన తెలిపారు.