Krishnam Raju: రెబెల్ స్టార్‌కు ఆపరేషన్.. ఎవ్వరికీ తెలియకుండా..
Krishnam Raju: కొంతకాలం క్రితం రెబెల్ స్టార్ కృష్ణంరాజు ఇంట్లో జారిపడ్డారని కథనాలు వినిపించాయి.;
Krishnam Raju (tv5news.in)
Krishnam Raju: అలనాటి హీరోల్లో చాలా పాపులారిటీ పొంది.. ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న నటుడు కృష్ణంరాజు. అదే క్రేజ్‌తో అభిమానులు ఆయనను ప్రేమగా రెబెల్ స్టార్ అని పిలుచుకుంటారు. కృష్ణంరాజు వారసుడిగా ప్రభాస్ సినిమాల్లోకి వచ్చిన తర్వాత ఆయన సినిమాలకు మెల్లమెల్లగా దూరమవుతూ వచ్చారు. తాజాగా ఆయన ఆరోగ్యం గురించి వినిపిస్తున్న ఓ కథనం రెబెల్ స్టార్ అభిమానులను కలవరపెడుతోంది.
కొంతకాలం క్రితం రెబెల్ స్టార్ కృష్ణంరాజు ఇంట్లో జారిపడ్డారని కథనాలు వినిపించాయి. తాజాగా ఆయన సతీమణి కూడా అవి నిజమే అంటూ స్పష్టం చేశారు. కానీ దాని వల్ల ఆయనకు ఆపరేషన్ కూడా అయ్యిందన్న విషయాన్ని ఆమె దాచేశారని రూమర్స్ వినిపిస్తున్నాయి. రాధే శ్యామ్‌లో ఓ కీలక పాత్ర పోషించిన ఆయన.. ప్రమోషన్స్‌లో కూడా ఎక్కడా కనిపించకపోవడంతో.. ఈ రూమర్స్ నిజమే అని చాలామంది ఫిక్స్ అయిపోతున్నారు.
కృష్ణంరాజు జారిపడడం వల్ల ఆయన కాలికి గాయమైందని, దానివల్ల ఆపరేషన్ జరిగి ఒక వేలిని కూడా తీసేశారని జోరుగా వదంతులు వినిపిస్తున్నాయి. ఇదే విషయం బయటపడితే అభిమానులు కంగారు పడతారని ఎవ్వరికీ తెలియనివ్వడం లేదట. దీని కారణంగానే ఆయన రాధే శ్యామ్ ప్రమోషన్స్‌లో పాల్గొనడం లేదని సమాచారం.