ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో ఇండియా నుంచి ఆస్కార్ కు అఫీషియల్ ఎంట్రీగా వెళ్లిన మూవీ లాపతా లేడీస్. ఆమిర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావు స్వీయ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రానికి దేశవ్యాప్తంగా అద్భుతమైన అప్లాజ్ వచ్చింది. ఈ మధ్య కాలంలో వచ్చిన ది బెస్ట్ మూవీ అని చూసినవాళ్లంతా కితాబునిచ్చారు. ఓటిటిలో సైతం విరగబడి చూశారు జనం. నితాన్షి గోయెల్, ప్రతిభా రత్న, స్పర్శ్ శ్రీవాత్సవ్, ఛాయా కదం, రవికిషన్ కీలక పాత్రల్లో నటించిన ఈ మూవీ నటీనటులకు సైతం చాలా ప్రశంసలు వచ్చాయి. అలాంటి మూవీ ఆస్కార్ లో కూడా ఇండియాను గర్వంగా తలెత్తుకునేలా చేస్తుందని భావించారు చాలామంది. బట్.. ఆస్కార్ షార్ట్ లిస్ట్ చేసిన 15 సినిమాల్లో లాపతా లేడీస్ కు చోటు దక్కలేదు.
విశేషం ఏంటంటే.. యూకే నుంచి రూపొందిన 'సంతోష్'అనే హిందీ సినిమా ఆ లిస్ట్ లో చోటు దక్కింది. మొత్తంగా లాపతా లేడీస్ ఖచ్చితంగా ఆస్కార్ చివరి వరకూ వెళుతుందనుకుంటే మొదటి దశలోనే వెను తిరిగింది.