Kollywood : తమిళ సినిమా పరిశ్రమపై ఉన్న ఆసక్తిని ప్రదర్శిస్తూ, తమిళ భాషపై ఉన్న పట్టుతో పవన్ కళ్యాణ్ తమిళ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. తాజాగా కోలీవుడ్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తనకి తమిళ కమెడియన్ యోగిబాబు సినిమాలంటే ఇష్టమని, అలాగే.. దర్శకుడు లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ స్టైల్ ఇష్టమని చెప్పారు పవన్ కళ్యాణ్. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన 'లియో, విక్రమ్ ’ సినిమాలంటే తనకి ఇష్టమని అన్నారు.
పవన్ కళ్యాణ్ ప్రశంసలకు లోకేష్ కనగరాజ్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ, పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ నుండి ప్రశంసలు అందుకోవడం గొప్ప అనుభూతి అని తెలిపారు. ఈ ఇద్దరు ప్రముఖుల మధ్య సాగిన ఈ ప్రశంసల పోటీ సోషల్ మీడియాలో వైరల్‌గా మారి, ఇరువురి అభిమానులను ఉత్సాహంగా నింపింది.
టాలీవుడ్ కు చెందిన పవన్ కళ్యాణ్, కోలీవుడ్ నటుడ్ని, దర్శకుడ్ని ప్రశంసించడం ద్వారా.. ఈ ప్రశంస సరిహద్దులు దాటిన అభిమానానికి నిదర్శనంగా నిలిచింది. సోషల్ మీడియాలో ఈ సంఘటన వైరల్‌గా మారడం ద్వారా ఇద్దరు ప్రముఖులకూ మరింత గుర్తింపు లభించింది.