Alluri: అన్ లక్కీగా మారిన 'లక్కీ మీడియా'

Alluri: బెక్కం వేణు గోపాల్ నిర్మించిన కొత్త సినిమా 'అల్లూరి'. శ్రీవిష్ణు హీరోగా ప్రదీప్ వర్మ దర్శకత్వంలో రూపొందిన ఈ మాస్ ఎంటర్టైనర్ నిన్ననే అంతగా బజ్ లేకుండా విడుదలైంది.;

Update: 2022-09-24 08:56 GMT

Alluri: బెక్కం వేణు గోపాల్ నిర్మించిన కొత్త సినిమా 'అల్లూరి'. శ్రీవిష్ణు హీరోగా ప్రదీప్ వర్మ దర్శకత్వంలో రూపొందిన ఈ మాస్ ఎంటర్టైనర్ నిన్ననే అంతగా బజ్ లేకుండా విడుదలైంది. అది కూడా ఫైనాన్షియల్ రీజన్స్ వల్ల మార్నింగ్ షోలు పడలేదు. ఇక ఓవర్సీస్ లో అయితే రాత్రి నుంచి షోలు మొదలయ్యాయి. అంటే మేకర్స్ సరైన ప్లానింగ్ లేకుండా సినిమాని విడుదల చేశారని చెప్పాలి. ఇక కాస్త ఆలస్యంగా విడుదలైన అల్లూరికి ఆడియన్స్ నుంచి అట్టర్ ఫ్లాప్ అనే టాక్ వచ్చింది.

సినిమా విషయానికొస్తే.. శ్రీ విష్ణు తన బలాన్ని వదిలి చేసిన సాము బెడిసి కొట్టింది. తన సహాజ నటనను దూరంగా పెట్టి తను పోలీస్ పాత్ర చేస్తున్నాననే విషయం ప్రతి క్షణం గుర్తు చేసాడు శ్రీవిష్ణు. ఊపిరి బిగబట్టుకొని చెప్పిన డైలాగ్స్ అత్యంత దారుణంగా ఉన్నాయి. పాత్రకు కావాల్సిన బాడీ లాంగ్వేజ్ ని మేయిన్ టైన్ చేయడంలో శ్రీవిష్ణు విఫలం అయ్యాడు. ఇప్పటి వరకూ హిట్ అయిన పోలీస్ కథలనుండి సీన్స్‌ని ఏరుకొని కుట్టిన ఈ పోలీస్ పాత్ర అతుకుల బొంతలా మారింది. ఈ మద్య కాలంలో వచ్చిన క్రాక్ లక్షణాలతో కనిపించిన అల్లూరి లో పోలీస్ పాత్రకుండే ఫోర్స్ కనపడలేదు.

అల్లూరి సినిమాకి సంబంధించి...కథలో కాంప్రమైజ్ అయ్యారా, లేక మేకింగ్ లో కాంప్రమైజ్ అయ్యారా అనేది క్లైమాక్స్ చూస్తే అర్దం అవుతుంది. స్కూల్ ని తమ ఆదీనంలో కి తీసుకున్న ఉగ్రవాదుల నుండి పిల్లలను కాపాడే ఏపిసోడ్ లో ఉండే ఉంత్కంఠత ను తెరమీదకు తీసుకురాలేకపోయాడు దర్శకుడు ప్రదీప్ వర్మ. ఈ ఎపిసోడ్ లో డైలాగ్స్ లో బలం ఉంది కానీ విజువల్ గా ఆ ఎపిసోడ్ అంత గొప్పగా అనిపించలేదు. సినిమాలు ఫెయిల్ అయినా సరే...శ్రీవిష్ణు నటన మీద ఎప్పుడూ విమర్శలు రాలేదు. కానీ అల్లూరి తో శ్రీవిష్ణు నటన పై బ్యాడ్ కామెంట్స్ వచ్చాయి. హీరో ఎలివేషన్స్ లో పడి కెరియర్ ని కాంప్రమైజ్ చేసుకుంటున్నాడు శ్రీ విష్ణు అని విమర్శకులు అంటున్నారు. హర్షవర్ధన్ రామేశ్వర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మరీ ఇబ్బందికరంగా మారింది.

అల్లూరికి నిర్మాత బెక్కం వేణు గోపాల్... లక్కీ మీడియా అధినేతగా టాలీవుడ్ లో గుర్తింపు తెచ్చుకున్న ఈ నిర్మాత .. అందరి అదృష్టాలను హరించేస్తున్నాడనే టాక్ ఇప్పుడు నడుస్తోంది. ఈయనతో సినిమా అంటే ఆ సినిమా బయటకు రావడమే సక్సెస్ అనేంతగా ఇబ్బందులు పడుతున్నాయి. ఆయన కొత్త సినిమా అల్లూరి రిలీజ్ కి పడ్డ పాట్లు అన్నీ ఇన్నీ కాదు. ఏ ఫైనాన్షియల్ కమిట్ మెంట్ ను నిలబెట్టుకోలేడనే టాక్ బలంగా వినిపిస్తుంది. గీతరచయితలకు చెల్లించాల్సిన డబ్బులు కూడా ఇవ్వకుండా మొండి చేయి చూపించిన ఈ ఘనుడు ప్రొడక్షన్ లో ఎలాంటి మాయలు చేసాడో ఆలోచించుకోవచ్చు. మొత్తానికి మేకింగ్ లో కాంప్రమైజ్ లు... రిలీజ్ ల ప్పుడు హైపర్ టెన్షన్స్ లు..లక్కీ మీడియా బ్యానర్ లో పడితే తప్పవని ఆ బ్యానర్లో సినిమాలు చేసిన హీరోలకే కాదు చూస్తున్న మిగతా హీరోలకు కూడా తెలుస్తోంది. అందుకే లక్కీ మీడియా బ్యానర్ లో కాస్త పేరున్న హీరోలు చేయాలంటే రిస్కే అనే టాక్ ఇండస్ట్రీలో వచ్చేసింది. 

Tags:    

Similar News